Need 100 births to understand what Sharad Pawar says: Raut శరద్ పవార్ ను అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలి: శివసేన

It needs 100 births to understand what sharad pawar says shiv sena s sanjay raut

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Aravind sawant, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

Shiv Sena leader Sanjay Raut said it would take "100 births" to understand what NCP chief Sharad Pawar says. The remark comes a day after the NCP chief gave a baffling response to queries on forming a coalition government in Maharashtra with ally Congress and ideologically opposite Shiv Sena.

శరద్ పవార్ ను అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలి: శివసేన

Posted: 11/19/2019 07:54 PM IST
It needs 100 births to understand what sharad pawar says shiv sena s sanjay raut

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో 20 రోజుల ప్రతిష్టంభన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం.. ఈ మేరకు శరవేగంగా తదుపరి చర్యలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ సిఫార్సును కేంద్రమంత్రిమండలి అమోదించడం, దానిని రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం, ఆ వేంటనే దానిని రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడం ఇలా చకచకా పనులు జరిగిపోయాయి. దీంతో ఎన్సీపీ కాంగ్రెస్ లతో కలసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న శివసేన ఆశలు అడియాశలయ్యాయా.? అంటే ఎంతమాత్రం కాదని సంజయ్ రౌత్ అంటున్నారు.

ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలి అని వ్యాఖ్యానించారు. అంతలా ఆయన ఎందుకు స్పందించారు. అసలేం జరిగిందీ అంటే అందకుముందు రోజున ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే ప్రశ్నకు శరద్‌పవార్‌ భిన్నమైన సమాధానం ఇచ్చారు. ‘బీజేపి-శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీ చేశాయి. మీరు అలా ఎలా అంటారు?. బీజేపి-శివసేన వారి దారి వాళ్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇక అంతటితో ఆగకుండా మా (కాంగ్రెస్-ఎన్సీపీ) రాజకీయాలు మేము చేసుకుంటాం అంటూ దాటవేత జవాబిచ్చారు. ఆ సమయంలో విలేకరులు శివసేన మేం పవార్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది కదా?అని అడగ్గా ‘నిజమా?’ అంటూ పవార్‌ ఎదరుప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో సంజయ్‌రౌత్‌ మాట్లాడుతూ పవార్‌తో మా పొత్తు గురించి మీరెవ్వరూ బెంగ పెట్టుకోవద్దని కోరారు. డిసెంబరు ఆరంభంలోనే మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తంచేశారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని, మీడియానే కాస్త గందరగోళం సృష్టిస్తోందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles