government employees work hours may increase! రోజువారి పని గంటల పెరుగుతున్నాయోచ్..!

Central government employees work hours may increase

Central Government Employees, Government Employees, working hours, increase of working hours, draft of increase of working hours, proposal of increase in working hours, Indian ministry of labour Employment, shram shakti bhawan, modi government, section 67 of code on wages, labour ministry

Government employees may soon have to work for 9 hours a day as the Centre has come up with a new proposal. According to a draft by Government of India's Ministry of Labour & Employment, Shram Shakti Bhawan, New Delhi,

రోజు వారి పని గంటల పెరుగుతున్నాయోచ్..!

Posted: 11/19/2019 06:15 PM IST
Central government employees work hours may increase

కేంద్రంలో రెండో పర్యాయం కొలువుదీరిన నరేంద్రమోడీ సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకోనుందా.? ఈ సారి కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులను టార్గెట్ చేసిందా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులకు షాక్ ఇవ్వనుంది. ఇన్నాళ్లు కాలర్ ఎగరేస్తూ మేము కేంద్రప్రభుత్వ ఉద్యోగులం.. కేవలం ఎనమిది గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తాం.. ఇక ఆ తరువాత మాకు పనులకు సంబంధమే లేదు అన్నట్లు వ్యవహరించే ఉద్యోగులతో పాటు ప్రైవేటు కంపెనీల కార్మికులు, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు.. సుపరిచితమైన విషయాన్ని ఇకపై అధికారికంగా అమల్లోకి తీసుకురానుంది కేంద్రం.

అదేంటి అంటారా.. ఉద్యోగుల కనీస పనిగంటలు మారనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న పనిగంటలు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలుగా మార్చనుంది కేంద్రం. వేతన కోడ్‌-2019 అమలులో భాగంగా కనీస వేతనాలు, కరవుభత్యం, పనిగంటలు, తదితర కార్మిక హక్కులకు సంబంధించి కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఇందులో భాగంగా కార్మికుల పనిగంటల సెక్షన్ 13, సబ్ సెక్షన్ (1) క్లాజ్ (ఎ) లోని మార్పులు చేయనుంది. వేతన కోడ్‌లో భాగంగా సాధారణ పనిదినంగా పరిగణించాలంటే తొమ్మిది గంటలని పేర్కొంది. ఒకవేళ విరామ సమయం ఎక్కువగా ఇచ్చినపుడు 12 గంటలు దాటి సాధారణ పనిదినం ఉండటానికి వీల్లేదని అంది.

కనీస వేతనాల ఖరారుకు ఆరు ప్రమాణాలను నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర కార్మికశాఖ... వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఈ నెలాఖరులోగా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it., This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ఈ-మెయిల్‌ ద్వారా పంపించాలని వెల్లడించింది. కార్మికుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాక వీటిని మరోమారు పరిశీలించి పనిగంటల పెంపుపై ఒక నిర్ణయానికి రానుంది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. కాగా వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్మికులకు మాత్రం ఈ నిబంధల్లో మార్పులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని తెలిపింది.

అయితే పనిగంటల పెంపు మినహాయించి పారిశ్రామిక చట్టం 1948లో ఎలాంటి మార్పులు వుండవబోవని తెలిపింది. ఇక కనీసం వేతనాల కోడ్ లో కూడా పలు మార్పులు చేసింది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు కలిపి (కార్మికుడు, భార్య, ఇద్దరు పిల్లలు) రోజుకి కనీసం 2700 కేలరీల ఆహారం, ఏడాదికి 66 మీటర్ల వస్త్రం ప్రామాణికంగా నిర్ణయించనుంది. ఈ రెండింటికి అయ్యే ఖర్చులో 10 శాతాన్ని ఇంటి అద్దెగా, 20 శాతాన్ని ఇంధనం, విద్యుత్తు, ఇతర ఖర్చులుగా లెక్కించనుంది. కనీస వేతనంలో 25 శాతం పిల్లల విద్య, వైద్యం, వినోదం, ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని నిబంధనల్లో కార్మికశాఖ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles