In Search of Fiance…Hyd techie Lands In Pak పాక్ అదుపులో హైదరాబాదీ యువకుడు.. ప్రేమకోసమై చెరలో..

31 months on missing hyderabad techie found in pakistan

Prashanth Vaindam, Dari Lal, Indians in Pakistan, Prashanth Vaindam nabbed, Prashanth Vaindam latest, Prashanth Vaindam in Pak, Hyderabadi in Pakistan, Indians illegal entry into Pakistan, Prashanth Vaindam video, Prashanth Vaindam viral video, Visakhapatnam, andhra pradesh, Telangana, Crime

The Pakistan rangers caught two Indians Prashanth Vaindam and Dari Lal for illegally entering into their country without any valid legal travel documents. Prashanth Vaindam who hails from Hyderabad and Dari Lal from Madhya Pradesh crossed the border near Sri Ganganagar in Rajasthan.

ITEMVIDEOS: పాక్ అదుపులో హైదరాబాదీ యువకుడు.. ప్రేమకోసమై చెరలో..

Posted: 11/19/2019 05:09 PM IST
31 months on missing hyderabad techie found in pakistan

ప్రేమ కోసమై వలలో పడెనా పాపం పసివాడు అన్న పాతాళ భైరవి చిత్రంలోని పాటను నిజం చేస్తూ.. తన ప్రేమ కోసం దేశ సరిహద్దు దాటిన యువకుడు.. గత రెండేళ్లుగా పాకిస్థాన్ లో నరకాన్ని చూస్తున్నాడు. అతనితో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో యువకుడు కూడా ఆర్మీ చేతిలో చిత్రవధను అనుభవించారని సమాచారం. తాజాగా ఒక యువకుడు తనవారి కోసం విడుదల చేసిన వీడియో నెట్టింట్లో సంచలనం కావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ఇద్దరు భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశామని చెప్పుకోచ్చారు.

అరెస్టైయిన వారిలో ఒకరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిలాల్ కాగా, మరొకరు విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ వైందం. పాకిస్తాన్ లోకి వచ్చేందుకు పాస్‌పోర్టు, వీసా లేకుండా అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14న వీరిని బహావుల్ పూర్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరిపైన అక్కడి చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదయ్యాయి. అయితే పాకిస్థాన్ పోలీసులు తెలిపిన వివరాలను భారత అధికారులు తోసిపుచ్చారు. ప్రశాంత్ గత రెండేళ్లుగా పాకిస్థాన్ అదుపులోనే వున్నాడని అరోపించారు.

ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్ అధికారులతో ప్రశాంత్ వివరాలను, ఫోటోలను కూడా పంపించామని భారత విదేశాంగ వర్గాలు స్పష్టం చేశాయి. రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతంలో వీచే బలమైన గాలుల వల్ల భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని, దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు పొరపాటు పడి సరిహద్దు దాటుతుంటారని భారత అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేక పర్యాయాలు చోటుచేసుకున్నాయని భారత అర్మీ అధికారులు తెలిపారు. ప్రశాంత్ విషయంలోనూ ఇదే జరిగివుంటుందని అధికారులు భావిస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం మిస్సింగ్ కేసు నమోదైనా.. కేసు దర్యాప్తును సీరియస్ గా తీసుకోని పోలీసులు.. ఇప్పుడు మాత్రం శరవేగంగా దర్యాప్తు సాగిస్తున్నారు. శ్రీకాంత్ కు చెందిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడమే ఇందుకు కారణం. ప్రశాంత్ 2017 నుండి ప్రశాంత్ ఎక్కడెక్కడ తిరిగారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు ఆయనకున్న పరిచాయాలపై కూడా దర్యాప్తు సాగుతోంది. ఇక ప్రశాంత్‌తో పట్టుబడ్డ హరీలాల్‌ ఎవరు.? ప్రశాంత్ తో ఎలా పరిచయం ఏర్పడింది.? అనే కోణంలో సైబరాబాద్ పోలీసులు.. విశాఖ పోలీసులతో కలసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంత్ మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం చేసేవాడని, అనంతరం బెంగళూర్ కు వెళ్లాడని అతని తండ్రి బాబురావు తెలిపారు. అక్కడే తన కుమారుడి ప్రేమ చిగురించిందని అయితే అతని ప్రేమ విఫలం కావడంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లాడని బాబూరావు చెప్పారు. దీంతోనే ఆయన రాజస్థాన్ నుంచి పోరపాటున పాకిస్థాన్ లోకి అడుగుపెట్టి వుండాటని అభిప్రాయపడ్డాడు. అంతేకానీ తన కుమారుడికి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదని వివరించాడు. ప్రశాంత్ అదృశ్యం కాగానే పోలీసు కేసు నమోదు చేశామని, ఎక్కడ వెతికినా అచూకీ లభించలేదని తెలిపారు. ఇక విశాఖకు చెందిన ప్రశాంత్ కుటుంబం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భగత్‌సింగ్ నగర్ లో నివాసం ఉంటున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prashanth Vaindam  Dari Lal  Indians in Pakistan  Visakhapatnam  andhra pradesh  Telangana  Crime  

Other Articles

Today on Telugu Wishesh