Airtel, Vodafone to hike prices from December ధరాఘాతం: ఎయిర్ టెల్, వోడాఫోన్ కస్టమర్లకు షాక్..

Airtel vodafone idea to hike tariffs next month to stay afloat

airtel, airtel service plan, airtel service price, airtel price hike, vodafone service plan, vodafone price hike, airtel broadband, airtel broadband plans, airtel broadband plans price, airtel dth plans, airtel dth plans price, airtel postpaid plans, airtel prepaid plan, airtel price hike, airtel price increased, airtel news, vodafone news, vodafone plans price, vodafone price increased, Business, Economy

Bharti Airtel and Vodafone-Idea Limited have announced plans to increase tariffs for customers from December 1. Both players reported massive losses in the quarter ending September 2019, with combined losses standing at 74,000 crore for the telecom companies.

ధరాఘాతం: ఎయిర్ టెల్, వోడాఫోన్ కస్టమర్లకు షాక్..

Posted: 11/19/2019 03:07 PM IST
Airtel vodafone idea to hike tariffs next month to stay afloat

ఎయిర్ టెల్ ఫోన్ వాడుతున్నారా..? లేక మీరు వొడాఫోన్ కస్టమరా.? మీరు పోస్టు పెయిడ్ కస్టమరా.? లేక ప్రీ ఫెయిడ్ ఖాతాదారా.? ఏదైనా కానీవ్వండీ కానీ.. ఈ డిసెంబర్ మొదలు మీ జేబుకు చిల్లు పెట్టేందుకు మేమున్నాయని అంటున్నాయి మీ ఫోన్ కంపెనీలు. అదేంటి అంటే.. ఈ రెండు కంపెనీలు కూడబలుకుకుని మూకుమ్మడిగా తమ కస్టమర్లకు వాతపెట్టేందుకు సిద్దమయ్యాయి. తాము ఎదుర్కోంటున్న తీవ్ర నష్టాల నుంచి తప్పించుకునేందుకు డిసెంబర్ 1 నుంచి తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

రిలయన్స్ జియో రాకతో వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితంగా ఇస్తూవచ్చిన కంపెనీలు.. అప్పటివరకు వున్న చార్జీలు, ప్లాన్ వివరాలను పక్కనబెట్టి.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాయి. అయితే అప్పటి వరకు వేసిన చార్జీలు వసూళ్లయిన లాభాలను మాత్రం దాచిపెడుతూ.. ఆర్థిక సంక్షోభం అన్న పేరుతో ధరల పెంపుకు శ్రీకారం చుట్టాయి. డిసెంబర్ 1 నుంచి పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొన్నాయి. ఇకపై కస్టమర్లను కాల్ చార్జీల పెంపు రూపంలో బాదేయనున్నాయి.

ఇరు కంపెనీలు నిమిషాల వ్యవధిలో టారిఫ్ ధరల పెంపును ప్రకటించడం విశేషం. దీంతో ఇరు కంపెనీలు కుమ్మక్కై ధరలను పెంచుతున్నాయా? అనే ప్రశ్నలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా భారతి ఎయిర్ టెల్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘టెలికం రంగంలో మూలధన పెట్టుబడులు అవసరం. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెడుతూనే వెళ్లాలి’ అని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెల ఆరంభమే ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నామని తెలిపింది.

వొడాఫోన్ కూడా ఎయిర్‌టెల్ దారిలో నడిచింది. డిసెంబర్ 1 నుంచి టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారీ నష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మద్దతు లభించకపోతే కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని వొడాఫోన్ ఇప్పటికే సంకేతాలు పంపింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపెనీల సంయుక్త నష్టాలు ఈ క్యూ2లో ఏకంగా రూ.74,000 కోట్లుగా ఉన్నాయి. ఏజీఆర్ బకాయిల కేటాయింపు ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇరు కంపెనీలు తన మనుగడ కోసం టారిఫ్‌లను పెంచుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles