Man wants daughters to be presented in HC స్వామి నిత్యానంద చుట్టు బిగుస్తున్న మరో ఉచ్చు..

Parents move hc to get daughters out of godman s institute

Swami Nityananda, Swami Nityananda institute, godman Nityananda, Nithyananda Dhyanpeetham, Yogini Sarvagyapeetham, Gujarat High Court, Janardana Sharma, Daughters, Swami Nithyananda, Lopamudra, Habeas Corpus, bangalore, ASHRAM, Karnataka, Ahmedabad, crime

A couple moved the Gujarat High Court, seeking custody of their two daughters who are being allegedly held in illegal confinement at an institution run by self-styled godman Swami Nithyananda here.

స్వామి నిత్యానంద చుట్టు బిగుస్తున్న మరో ఉచ్చు.. గుజరాత్ హైకోర్టులో కేసు..

Posted: 11/19/2019 03:59 PM IST
Parents move hc to get daughters out of godman s institute

వివాదాస్పద స్వామిజీగా చరిత్రకెక్కిన నిత్యానంద చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోందా.? అంటే ఔనన్న సంకేతాలే వినిపిస్తున్నాయి. ఆయన ఆశ్రమంలో వున్న తన ఇద్దరు కుమార్తెలను విడిపించి తమకు అప్పగించాలని కోరుతూ వారి తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. స్వామిజీ ఆశ్రమంలో తమ కూతుళ్లను నిర్బంధించి.. వారిని భయాందోళనకు గురిచేస్తున్నారని వారు న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్నారు. తమ కూతుళ్లను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి.. తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హెడియస్ కార్పస్ దాఖలు చేసారు.

అటు గుజరాత్ తో పాటు ఇటు కర్ణాటక, దక్షిణ భారతవనిలో ఈ వార్త సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జనార్థన శర్మ దంపతుల సంతానమైన నలుగురు కూతుళ్లను 2013లో బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో చేర్పించారు. నిత్యానంద ఆశ్రమానికి చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థలో వారు విద్యాబుద్దులు నేర్చకుంటారని వారు భావించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో జనార్థన్ శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్ లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు.

కర్ణాటకకు చెందిన తాము తమ కూతుళ్లను చూసేందుకు ప్రతీసారి గుజరాత్ వెళ్లి రావడం కష్టమని వారిని చెప్పి.. తిరిగి కర్ణాటకకు రప్పించాలని వారు ఆశ్రయ నిర్వాహకులకు విషయాన్ని చెప్పినా.. వారు పెడచెవిన పెట్టారు. తమకు కనీస సమాచారం లేకుండా కర్ణాటకలోని నిత్యానంద ద్యానఫీఠం నుంచి ఎలా గుజరాత్ లోని యోగిని సర్వజ్ఞానపీఠం ఆశ్రమానికి బదిలీ చేస్తారని ప్రశ్నించినా.. అది కాస్తా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అన్న చందంగా మారింది. ఈ ప్రశ్నలకు అక్కడి ఆశ్రమ అధికారుల నుంచి ఎలాంటి బదులు లేదు. వ్యయప్రయాసలకోర్చి వారు గుజరాత్ వెళ్లిగా అక్కడి అధికారులు ఆయనను తమ కూతుళ్లను కలిసేందుకు అనుమతించలేదు.

తమ కూతుళ్లను కలిసేందుకు వచ్చామని జనార్థన్ శర్మ దంపతులు చెప్పినా.. సర్వఙ్ఞాన పీఠం అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించిన జనార్థన్ శర్మ దంపతులు వారి సహాయంతో ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే అదే ఆశ్రమంలో వున్న మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన శర్మ దంపతులు.. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles