BJP to stage 'Sadak Bandh' throughout Telangana ‘‘సడక్ బంద్’’కు పిలుపునిచ్చిన టీఎస్ఆర్టీసీ కార్మికులు

Tsrtc strike enters 45th day call for sadak bandh on nov 19

TSRTC Workers, High Court, sadak bandh, BJP Laxman, TRS Agents, IAS officials, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

BJP will stage a 'sadak bandh' throughout Telangana on November 19 against the acts of some officials in the state government who are acting like "agents of the ruling TRS" by going against those who sided with the TSRTC employees, said the party's state President Dr K Laxman.

టీఎస్ఆర్టీసీ సమ్మె చట్టబద్దతను తేల్చాల్సింది లేబర్ కోర్టే: హైకోర్టు

Posted: 11/18/2019 04:31 PM IST
Tsrtc strike enters 45th day call for sadak bandh on nov 19

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు చేపట్టిన సమ్మెగా చరిత్ర పుటలకు ఎక్కినా.. సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కొనసాగుతోంది. ఇవాళ్టితో కార్మికులు చేపట్టిన సమ్మె ఏకంగా 45వ రోజుకు చేరకుంది. ఈ తరుణంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఈ అంశమై పలు పిటీషన్లు దాఖలు కాగా, వాటిపై ఇప్పటికే న్యాయస్థానం విచారించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట వ్యతిరేకం అని చెప్పలేమని ఇదివరకే స్పష్టం చేసిన న్యాయస్థానం.. తాజాగా ఈ విషయమై ఇవాళ మరోమారు విచారించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం తమ వాదనలను వినిపించగా, వాటికి హైకోర్టు బదులిచ్చింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులు ఇచ్చిందంటూ ఉదహరించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేనివని, కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని వివరించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. విలీనం డిమాండ్ ను తాత్కాలికంగా పక్కనబెట్టినా, మళ్లీ ఆ డిమాండ్ తో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తారని తెలిపారు.

కార్మిక సంఘాల నేతలు స్వార్థంతో ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని, సమ్మెను చట్టవిరుద్ధం అని ప్రకటించాలని కోరారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ, సమ్మెను చట్టవ్యతిరేకం అని చెప్పలేమని స్పష్టం చేసింది. సమ్మె చట్టసమ్మతమా, లేక చట్టవిరుద్ధమా అనేది లేబర్ కోర్టు నిర్ణయిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. సమ్మె వ్యవహారంపై కమిటీ వేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. దీంతో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. ఇదిలావుంటే 45 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా తమను కనీసం గుర్తించని ప్రభుత్వంపై కార్మికులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

ఈ తరుణంలో కార్మికులు మంగళవారం రోజున సడక్ బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల బంద్ నిర్వహించాలని కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. దీనికి బీజేపి పార్టీ నుంచి మద్దతు లభించింది. అన్ని పార్టీల నేతలు కూడా అర్టీసీ కార్మికుల అందోళనలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులు.. అధికార పార్టీ ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు గణంకాలు, తప్పుడు అరోపణలు చేసినా అధికారులు.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపి, ఆర్టీసీ కార్మికులు పూనుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తప్పుడు అరోపణలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  sadak bandh  TRS Agents  IAS officials  BJP Laxman  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles