Priest allegedly slaps woman devotee at Chidambaram Temple తల్లిలాంటి భక్తురాలిపై చేయిచేసుకున్న అర్చకుడు.. పరారీలో..!

Temple priest slaps woman for demanding proper conduct of rituals

Mukkuruni Vinayagar temple, Thillai Natrajar Temple complex, Chidambaram, Foul Language, Chidambaram, Nataraja swamy Temple, Tamil Nadu priest, Thillai Natrajar, Tamil Nadu temple, Priest Darshan, Slap, Latha, Woman Devotee, Gold Chain, Tamil Nadu, Crime

A priest from the famous Nataraja Temple in Chidambaram is at large after he allegedly slapped a woman devotee who asked him about a pooja ritual. The incident took place at the Mukkuruni Vinayagar shrine inside the temple complex.

తల్లిలాంటి భక్తురాలిపై చేయిచేసుకున్న అర్చకుడు.. పరారీలో..!

Posted: 11/18/2019 02:48 PM IST
Temple priest slaps woman for demanding proper conduct of rituals

పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలివస్తుంటారు. ఈ మాసంలో సాదరణ అభిషేకాలతో పాటే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగడం పరిపాటి. నిత్యం దైవనామ స్మరణలోనే ఇటు భక్తులతో పాటు అటు ఆలయ అర్చకులు వుంటారు. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తమ కుమారుడి పుట్టినరోజు సంరద్భంగా అర్చన చేయించేందుకు వచ్చిన ఓ భక్తురాలికి ఘోర పరాభవం ఎదురైంది. ఆలయ అర్ఛకుడే అమె పట్ల అమర్యాదగా వ్యహరించడంతో పాటు అమెపై చేయి చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

ఆకాశలింగంగా ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన పవిత్ర ఫుణ్యక్షేత్రమైన చిదంబరంలో ఈ ఘటన సంభవించింది. చిదరంబర నటరాజ ఆలయంలో ఓ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఓ పూజారి.. సంయమనం మర్చి.. తన తల్లి వయస్సులో వుండే ఓ భక్తురాలిపై చేయిచేసుకున్నాడు. అమర్యాదగా ప్రవర్తించడమే కాక అమె తన మెడలోని బంగారు చైనును లాక్కునేందుకు ప్రయత్నించిందని బుకాయించాడు. ఆలయ కమిటీ సభ్యులు చెప్పినా.. అమెకు క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించని ఆలయ అర్చకుడు.. పోలీసులు కేసు నమోదు చేయడంతో పారిపోయి.. తప్పించుకుని తిరుగుతున్నాడు.  

ఈ ఘటన తాలుకు వివరాల్లోకి వెళ్తే.. లత అనే మహిళ తన కుమారుడు రాజేశ్ పుట్టిన రోజు సందర్భంగా చిదంబర నటరాజస్వామి ఆలయానికి చేరుకుంది. ఆలయంలో తన కుమారుడి పేరున స్వామివారికి అర్చన చేయించేందుకు రశీదు పొందింది. నేరుగా ఆలయంలోకి వెళ్లి తాను తీసుకున్న రసీదుతో పాటు అమె తనవెంట తీసుకువచ్చిన పూజా సామగ్రిని ఆలయ అర్చకుడు దర్శన్ చేతికి ఇచ్చింది. చేతిలో గవ్వ పడితే కానీ నోట్లోంచి మంత్రాలు రాల్చని అర్చకులు వున్నారన్న అభియోగాలు అర్చక సమాజంపై వినిపిస్తున్న తరుణంలో.. ఆ దేవాలయంలోని అర్చకుడు దర్శన్ ఉదతం పరాకాష్టగా నిలుస్తుంది.

అర్చకుడు దర్శన్ ను స్వామివారికి అర్చన చేయమని కోరగా, ఆయన కనీసం మంత్రాలు కూడా చదవకుండా కేవలం గోత్రనామాలను కూడా ఉచ్చరించకుండా.. అమె చేతిలో అమె తీసుకువచ్చిన పూజాసామాగ్రిని పెట్టాడు. దీని అమె నిలదీసింది. కనీసం కొబ్బరికాయ కొట్టకుండా.. మంత్రోచ్ఛరణ చేయకుండా ఎలా అర్చన చేశారని అమె ప్రశ్నించింది. దీంతో పూజారి దర్శన్ కు.. భక్తురాలు లతకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో అవేశానికి లోనైన దర్శన్ ఆమె.. తన తల్లి వయస్సు వుంటుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. అమెపై చేయిచేసుకున్నాడు.

దీంతో కంటతడి పెట్టుకున్న భక్తురాలు వెంటనే విషయాన్ని ఆలయంలోని అధికారులతో పాటు అక్కడి కమిటీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమయంలో అర్చకుడు దర్శన్ ధ్వజస్థంభంపై కూర్చోని.. అక్కడివారికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అంతేకాదు భక్తురాలు నిలదీసిన విషయాన్ని పక్కన బెట్టి ఆయన మరో కట్టుకథ చెప్పాడు. భక్తురాలు లత తన మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను ఆమెను అడ్డుకోబోయానని, దీంతో తన చేయి ఆమె చెంపకు తగిలిందని చెబుతున్నాడు. క్షమాపణలు అడగకుండా తప్పించుకునే క్రమంలో ఈ తప్పుడు కథను చెప్పాడు. దీంతో లత పోలీసులను అశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పూజారి దర్శన్ ఆలయంలో వుండకుండా పలాయనం చిత్తగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chidambaram  Nataraja swamy Temple  Priest Darshan  Slap  Latha  Woman Devotee  Gold Chain  Tamil Nadu  Crime  

Other Articles

Today on Telugu Wishesh