Learn from KCR how to protect Telugu: Pawan ‘ఉపరాష్ట్రపతి’ ఆర్టికల్ కనువిప్పుకావాలి: పవన్ కల్యాణ్

Pawan kalyan advises jagan over to take lessons from kcr to safeguard telugu

Janasena, Pawan Kalyan, Telugu culture, JSP, KCR, YSRCP, Telangana, pawan kalyan on safe guarding telugu, pawan kalyan on venkaiah naidu article, pawan kalyan on telugu, pawan kalyan on YSRCP, pawan kalyan on Telangana, pawan kalyan on protecting telugu, pawan kalyan vishaka long march, pawan kalyan Long March deadline to government, Mangalagiri, Amaravati, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan takes a dig at YSRCP Government and suggests to take lessons from Telangana Chief Minister K. Chandrasekhar Rao on how to safeguard Telugu language and culture.

వైసీపీ నేతలు కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి: పవన్ కల్యాణ్

Posted: 11/11/2019 11:45 AM IST
Pawan kalyan advises jagan over to take lessons from kcr to safeguard telugu

అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై కదిలి విశాఖలో వారికి అండగా తాము వున్నామని భరోసా కల్పించాలని డిమాండ్ చేసి.. ప్రభుత్వానికి రెండు వారాల డెడ్ లైన్ విధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లాంగ్ మార్చ్ విజయవంతం కావడం.. పార్టీ అంచనా వేసినదానికన్నా అధికంగా ప్రజలనుంచి స్పందన రావడంతో మంచి హూపారు మీద వున్నారు. అప్పటి నుంచి నిత్యం ప్రజల సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వున్నారు. తాజాగా తెలుగు బాష పరిరక్షనపై ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన మండిపడ్డారు.  

పాఠశాల్లో అంగ్లమాద్యమాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అన్నివైపుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఈ విషయమై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలుగు బాషా పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో పోరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నుంచి.. ముఖ్యమంత్రి కేసీఆఱ్ నుంచి జగన్ సర్కార్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం వుందని చురకలంటించారు.

అంతటితో ఆగని పవన్ కల్యాణ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాసిన అర్టికల్ వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ట్వీట్ చేశారు. దీనికి తోడు ఉప రాష్ట్రపతి రాసిన అర్టికల్ ను ఈనాడు దినపత్రికలో ప్రచురితం కాగా దానిని అప్ లోడ్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘అందరి కోసం అమ్మ బాష’’ అన్న శీర్షికన రాసిన వ్యాసంలో మాతృబాషను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందని ఆయన చెప్పారు. బోధన మాధ్యమానికి సంబంధించి మరీ ముఖ్యమంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యను ఏ బాషలో బోధించాలనే విషయమై నిర్ణయాలు తీసుకునేప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Telugu culture  JSP  KCR  YSRCP  Venkaiah Naidu  Telangana  andhra pradesh  politics  

Other Articles