MMTS Hits Intercity Train In Kachiguda Station ఒకే ట్రాకుపై రెండు రైళ్లు.. 20 మందికి గాయాలు

Two trains collide at kacheguda railway station in hyderabad 30 injured

train accident, Nimboli adda train accident, kachiguda train accident, railway station, mmts train accident, kurnool inter-city train accident, Nimboli adda, kachiguda, railway station, mmts train, kurnool inter-city train, signal failure, hyderabad, Crime

At least 20 people were reportedly injured after two passenger trains collided at the Kacheguda Railway Station in Hyderabad. According to reports, three coaches of the Lingampalli-Falaknuma local train and four coaches of the Kurnool City-Secunderabad Hundry Express got derailed following the collision.

సిగ్నలింగ్ అధికారుల నిర్లక్ష్యం: ఒకే ట్రాకుపై రెండు రైళ్లు.. 20 మందికి గాయాలు

Posted: 11/11/2019 12:27 PM IST
Two trains collide at kacheguda railway station in hyderabad 30 injured

కాచిగూడ రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి సిర్ పూర్ కాగజ్ నగర్ కు వెళ్లే హంద్రీ ఎక్స్ ప్రెస్ (కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్‌ ప్రెస్) రైలును వెనుకగా వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. కర్నూల్ ఇంటర్ సిటీ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో స్టేషన్ లో ఓ ట్రాక్ పై నిలిపిఉంచారు. ఫలక్ నుమా నుంచి కాచిగూడకు బయల్దేరిన ఎంఎంటీఎస్ రైలు కూడా అదే ట్రాక్ పైకి రావడంతో నిలిపి ఉంచిన రైలును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ రైలు ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అసుపత్రులకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన ఎంఎంటీఎస్ పైలట్ ఎంతోగానో ప్రమాదం జరగకుండా నియంత్రించినందు వల్లే ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే తన శాయశక్తులా ప్రమాద నివారణ కోసం చర్యలు తీసుకున్న ఎంఎంటీఎస్ పైలట్ మాత్రం రైలు ఇంజన్లో చిక్కుకున్నాడు. ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడినప్పటికీ, తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

కోచ్ లో చిక్కకుపోయి తీవ్ర గయాలతో బాధపడుతున్న ఆయన.. ప్రయాణికులతో పాటు రైలు సిబ్బందిని తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తుండటం చూపరులను కలచివేస్తోంది. కోచ్ లో ఉన్నఆయనకు ఆక్సిజన్ అందించడంతో పాటు సెలైన్ ఎక్కిస్తున్నారు. మరోవైపు, ఆయను కోచ్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రైల్వే సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మెటల్ తో తయారుకాబడిన కోచ్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరో 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఒక ట్రాక్ పై కర్నూలు ఇంటర్సీటీ రైలును నిలిపి ఉంచిన తర్వాత.. అదే ట్రాక్ పైకి వచ్చేందుకు ఎంఎంటీఎస్ రైలుకు సిగ్నల్ ఎలా ఇస్తారని ప్రయాణికులు రైల్వే అధికారులను నిలదీశారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని.. ప్రాణ నష్టం జరగలేదని ప్రయాణికులు పేర్కోన్నారు. ఒక వేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎవరూ బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని ప్రయాణికులు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles