CJI reviews security preparedness before Ayodhya Verdict ఆయోధ్య కేసు తీర్పు: ఉత్తర్ ప్రదేశ్ సీఎస్, డీజీపీలతో సీజేఐ సమావేశం

Ayodhya verdict up chief secretary meets cji ranjan gogoi in sc

Ayodhya case, ayodhya verdict, ayodhya mandir, Ayodhya Ram Mandir, ayodhya ram mandir verdict, ayodhya supreme court verdict, Ayodhya verdict, ayodhya verdict date, Babri Masjid, babri masjid ayodhya, CJI Ranjan Gogoi, Ram Mandir, latest updates, Uttar Pradesh, Politics

Chief Justice of India Ranjan Gogoi is likely to have a meeting with Uttar Pradesh chief secretary Rajendra Kumar Tiwari and director general of police on Friday to assess the law and order arrangement in the state ahead of the verdict on the Ayodhya land dispute case

ఆయోధ్య కేసు తీర్పు: ఉత్తర్ ప్రదేశ్ సీఎస్, డీజీపీలతో సీజేఐ సమావేశం

Posted: 11/08/2019 01:45 PM IST
Ayodhya verdict up chief secretary meets cji ranjan gogoi in sc

అయోధ్యలోని రామ మందిరం, బాబ్రీ మసీదు స్థల వివాదంపై త్వరలో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అస్కారం లేకుండా ముందస్తు చర్యలు తీసుకునే విషయమై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదేశాలు వెళ్లగా.. తాజాగా అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ పటిష్టమైన ముందస్తు చర్యలపై అత్యున్నత న్యాయస్థానం సమీక్షించనుంది.

ఈ మేరకు ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రా ఉన్నతాధికారులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలపై ఆయన వారితో చర్చించారు. యూపీ సీఎస్‌ రాజేంద్ర కుమార్‌తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్‌ సింగ్‌లను తన ఛాంబర్‌కు సీజేఐ పిలిచారు. దేశంపై, దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఈ చారిత్రక తీర్పు నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఆయన సమీక్షించినట్లు సమాచారం.

అయోధ్యపై తీర్పును నవంబర్‌ 15కు ముందే సుప్రీంకోర్టు వెల్లడించనుంది. ఈ నెల 13-15 మధ్య కాలంలో సీజేఐ రంజన్‌ గొగోయ్‌ అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెల్లడించనున్నారు. 17న ఆయన పదవీవిరమణ చేయనున్న విషయం తెలిసిందే. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌ఏ బోబ్డే ఈ కేసుపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అంత్యంత ప్రధాన్యత కలిగిన కేసుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. అయోధ్య కేసుపై నియమితమైన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో బోబ్డే కూడా వున్నారు.

ఆయోధ్య తీర్పు రానున్న క్రమంలో యూపీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 24 గంటలు పని చేసే మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థను నెలకొల్పారు. ఆయోధ్యకు అదనంగా 4 వేల మంది పారామిలటరీ సిబ్బందిని తరలించారు. అక్కడ ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులో ఉంది. ఇక మరోవైపు రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగి.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నాయి. అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో నాలుగు వేల మంది పారామిలిటరీ పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles