TSRTC is not recognised by us, Centre tells HC టీఎస్ఆర్టీసీ విభజన జరగలేదు.. అధికారికంగా గుర్తించలేం: కేంద్రం

Tsrtc has no legal sanctity says assistant solicitor general to high court orders

TSRTC Workers, High Court, Assistant Solicitor General, N. Rajeshwar Rao, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, RTC MD affidavit, High court urges workers to call off strike, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Telangana High Court has directed the state government to hold discussions with the striking employees of the TSRTC to resolve the over the one-month long strike. Assistant Solicitor General N. Rajeshwar Rao replied to High court that the TSRTC has no legal sanctity.

టీఎస్ఆర్టీసీ విభజన జరగలేదు.. అధికారికంగా గుర్తించలేం: కేంద్రం

Posted: 11/08/2019 12:59 PM IST
Tsrtc has no legal sanctity says assistant solicitor general to high court orders

తెలంగాణ ఆర్టీసీ విషయం ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తలంటుతున్నా.. ఏ మాత్రం పట్టని ఆర్టీసీ యాజమాన్యం తన తీరును మార్చుకోవడం లేదు. ఈ క్రమంలో కార్మికులను తొలగించే చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హుంకరింపులు తాటాకు చప్పళ్లేనని హైకోర్టు తేల్చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టులో అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు న్యాయస్థానానికి కేంద్రం వాదనను వినిపించారు. దీంతో కేంద్ర గుర్తింపు లేకుండా టీఎస్ఆర్టీసీ స్థాపన ఎలా జరిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది.

తాజాగా ఈ విషయమై కేంద్రం స్పిందించింది. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తేల్చిచెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కోన్నట్లు తెలిసింది. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సమ్మె వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కేంద్రానికి రాసిన లేఖకు సమాధానంగా గడ్కరీ ఈ ప్రత్యుత్తరం రాశారు.

కాగా ఈ విషయాలను క్రితం రోజున హైకోర్టులో అడిషనల్ సాలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు కూడా చెప్పారు. ఆర్టీసీని విభజించాలని కానీ, పునర్వ్యవస్థీకరించాలని కానీ తమ అనుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని ఆయన తెలిపారు. అసలు, ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదని వెల్లడించారు. అలాంటప్పుడు చట్టబద్ధతలేని టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఎక్కడ ఉంటుందని, చట్టబద్ధత ఉన్న ఏపీఎస్ఆర్టీసీలోనే 33 శాతం వాటా ఉందని రాజేశ్వరరావు కోర్టుకు తెలియజేశారు. టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేనందున ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటాను బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు.

దీనిపై ఏజీ,తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ, ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఏపీఎస్ఆర్టీసీని విభజించాలని రెండు రాష్ట్రాలు కోరాలి కదా? అని ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా కొత్త ఆర్టీసీ సంస్థలు ఏర్పాటు ఎలా సాధ్యం అంటూ అడిగింది. విభజన అంశం పెండింగ్ లో ఉందని మీరే అంటున్నారు, అలాంటప్పుడు కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles