Delhi Metro PDA Moment Gets Mixed Reactions మెట్రో రైలులో యువజంట పాడు పని..

Viral video delhi metro pda moment gets mixed reactions from netizens

couple kissing in metro train, couple kissing in delhi metro train, couple kissing in train, 2019 viral videos, Delhi Metro, Kissing in public, PDA video, viral video of couple kissing in public, Viral Videos, couple kissing video twitter, netizens, public place

A video capturing a couple’s PDA-filled moments in Delhi Metro is being circulated on Twitter. Some were criticising the pair for engaging in mouth-to-mouth kissing in a public place, others are calling out the person who shamelessly recorded it and posted on social media.

మెట్రో రైలులో యువజంట పాడు పని.. నెటిజన్లు ఏమన్నారంటే..

Posted: 11/08/2019 12:22 PM IST
Viral video delhi metro pda moment gets mixed reactions from netizens

మెట్రో రైలులో ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువజంట ప్రేమకలాపంలో మునిగిపోయిన వీడియో ఒకటి నెట్టింట్లో సంచలనంగా మారింది. జంకూ గొంకూ లేకుండా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ వారు ప్రవర్తించిన తీరుతో తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైలులో నాలుగు రోజుల క్రితం జరిగింది. ఈ యువ  జంట బహిరంగంగా సాగించిన ఈ వ్యవహారాన్ని తోటి ప్రయాణికుడొకరు తన మొబైల్ కెమేరాలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అవి వైరల్‌ అయ్యాయి.

సహజంగానే ఇలాంటివి చూసినప్పుడు స్పందించే నెట్ జనులు భారత సంస్కృతి. సంప్రదాయం మరిచి.. నాలుగు గోడల మధ్య అత్యంత రహస్యంగా సాగించాల్సిన పనులను అందరూ చూస్తుండగా.. బహిరంగంగా వ్యవహరించడంపై నెటిజన్లు యువజంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి పెరిగిన విధానం.. వారిని పెంచిన వారిపట్ల కూడా కామెంట్లు చేస్తున్నారు. పబ్లిక్ గా అధరచుంభనం పెట్టడం అంత అవసరమా అంటూ నిలదీస్తున్నారు. ఇంకోందరైతే మెట్రో రైలును పడకగదిగా మార్చేశారని కూడా కామెంట్లు పెడుతున్నారు.

అయితే మరికోందరు మాత్రం ఈ యువజంట చేసిన పనిని వ్యతిరేకిస్తున్నా.. వారికే మద్దతును ప్రకటిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లలో ఇలాంటి పనులు చేయడం తప్పే.. అయితే చెడు చేయకూడదు అంటున్నవారు.. చెడును చూడకూడదు అని కూడా చెప్పారని, అలాంటప్పుడు యువజంట చేసిన పనిని తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కూడా పెద్ద తప్పేనని వారు వాదిస్తున్నారు. యువజంటపై పోలీసులు కేసులు పెడితే.. వీడియో పోస్టు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక యువజంట చేసిన చర్యలను సమర్థిస్తున్నవారు కూడా తక్కువేం లేరు. యువజంట హద్దులు మీరారని అంటున్నవాళ్ల బుర్రలు ఇంకాస్త పెరగాల్సిన పని వుందని కూడా చిర్రుబుర్రలాడుతున్నారు. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో మహిళలు నృత్యం చేయడం, సంగీతం వినడం కూడా తప్పేనని, అలాగే అమెరికా లాంటి దేశాల్లో పబ్లిక్ గా ముద్దుపెట్టుకోవడం తప్పేం కాదని, అయితే మనది భారత దేశం కాబట్టి అవేశకామేశాలకు లోనైన యువజంట చుంభనం మునిగితేలారని, దానిని తప్పుగా చూడటం సరికాదని అంటున్నారు. ఇంకోందరు మాత్రం ‘‘మోరల్ పోలీసింగ్’’ అంటూ ముఖం చిట్లిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో ఏంచెబుతుందో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles