TTD hikes room rents at Tirumala from today తిరుమలలో గదులకు అద్దె పెంపు.. ఇవాళ్టి నుంచే అమలు

Ttd hikes room rents at tirumala from today

tirumala room rents, tirumala rents, tirumala tirupati devasthanam, nandakam, panchajanyam, kausthubham, rents doubled at tirumala, rents, toddlers darshan, tirumala special darshan for toddlers, Tirumala Tirupati Devasthanam, TTD chairman YV SubbaReddy, Tirumala, Andhra Pradesh

Tirumala tirupati devasthanam board had taken a key decesion of hiking the cottages rent and implemented it from today

తిరుమలలో పెరిగిన గదుల అద్దెలు.. ఇవాళ్టి నుంచే అమలు

Posted: 11/07/2019 06:01 PM IST
Ttd hikes room rents at tirumala from today

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యధామం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య అసంఖ్యాకంగా దినదినప్రవర్తమానంగా పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో తిరుమలను సందర్శించే భక్తులు వడ్డీకాసలు వాడికి ముడుపులు చెల్లించడం కూడా పరిపాటే. భక్తులు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చే నిధులతో ఏం చేయాలా.? అని టీటీడీ బోర్డు పలు సందర్భాలలో మేధోమధనం చేసి.. ఓ నిర్ణయానికి వస్తున్న ఘటనలు కూడా మనం చూశాం. అయితే భక్తుల ఇచ్చేది అటుంచితే.. వారి నుంచి ఎలా అధికంగా వసూలు చేయాలన్న అన్న విషయమై టీటీడీ దృష్టిసారించిందా.? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

మరీ ముఖ్యంగా సామాన్యభక్తులను టార్గెట్ చేసిన టీటీడీ బోర్డు ఇక ఆదాయాన్ని పెంచుకోవడమే తమ పరమావధిగా నిర్ణయం తీసుకుంది. తిరుమలలో సామాన్య భక్తులు ఒకటి రెండు రోజుల పాటు బస చేసే అతిధి గృహాల అద్దెలను అమాంతం పేంచేసింది. పెరిగిన ధరలన్నింటినీ ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తెచ్చింది. నందకం అద్దె గదుల ధరలు ఇప్పటివరకు రూ.600గా ఉండేవి.. ఇప్పుడు రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. వేంకటేశ్వరుడి భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3000 వరకు వసతి సదుపాయం ఉంది.

రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతి కింద లెక్కిస్తారు. అయితే సామాన్య భక్తులను ఇబ్బందుల పాలు చేసేలా టీటీడీ నిర్ణయం వుంది. ఇప్పటికే ఫుణ్యధామాలన్ని కాసులు రాలే కమర్షియల్ కేంద్రాలేనన్న విమర్శలు వస్తున్న క్రమంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, రూ.999, రూ.1500తో లభించే గదుల్లో ఏసీ సదుపాయం ఉంటుంది. సామాన్యులు అధికంగా రూ.100కి వచ్చే వసతి గదుల్లో అత్యధికంగా ఉంటారు. ఆ గదులు దొరకకపోతే  రూ.500, రూ.600 చెల్లించి సాధారణ వసతి గదల్లో ఉంటారు. కాగా, తిరుమలలో వసతి గదుల ధరలను పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం పెంచలేదు. రూ.100, రూ.200, రూ.300, రూ.400,  రూ.600,  రూ.800, రూ.1000కు లభ్యమయ్యే వసతి గదులను ఎప్పటిలాగే భక్తులు పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles