Bengal man wants gold loan against cows గోవులపై గోల్డ్ లోన్ కోసం రైతు ఏం చేశాడంటే..

Man seeks gold loan against cows after ghosh s remark

Bengal man, gold loan, cows, dilip ghosh, bengal BJP President, Manappuram Finance Limited, Dankuni, Garalgacha gram panchayat, West Bengal, BJP, Trinamul congress, politics

A man in West Bengal's Dankuni area reached a branch of Manappuram Finance Limited in the hope of securing a gold loan against two cows. He hoped to get the loan after hearing that cow milk contains gold in it.

గోవులపై గోల్డ్ లోన్ కోసం రైతు ఏం చేశాడంటే..

Posted: 11/07/2019 04:57 PM IST
Man seeks gold loan against cows after ghosh s remark

ఆవు పాలల్లో బంగారం ఉందని బీజేపీ ముఖ్యనేత చేసిన వ్యాఖ్యలతో ఓ బెంగాల్ రైతు పూర్తిగా విశ్వసించాడు. పాలలో బంగారం ఎలా వుంటుందన్న అలోచన కూడా చేయకుండా ఏకంగా తన వద్ద ఉన్న రెండు ఆవులను తీసుకుని సమీపంలోని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీకి వెళ్లాడు. తన వద్ద రెండు గోవులు వున్నాయని వాటిపై గోల్డ్ లోన్ ఇవ్వాలని నిష్కల్మషంగా అభ్యర్థించాడు. వచ్చే రుణంతో మళ్లీ తాను గోవులనే కొంటానని, నమ్మకంగా చెప్పిన వింత ఉదంతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దన్‌కునీ గ్రామంలో వెలుగుచూసింది.
 
భారత జాతికి చెందిన ఆవు పాలల్లో బంగారం ఉందని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యాలతో స్పూర్తి పొందిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దన్‌కునీకి చెందిన ఓ యువ రైతు తన వద్ద ఉన్న రెండు ఆవులను మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ శాఖకు తీసుకు వచ్చి చూపించి, వీటిపై గోల్డ్ లోన్ ఇవ్వాలని కోరాడు. ‘‘ఆవు పాలల్లో బంగారం ఉందని నేను విన్నాను. ఈ రెండు ఆవులే నా కుటుంబానికి జీవనాధారం. అందుకే బంగారం పాలు ఇస్తున్న రెండు ఆవులను తీసుకువచ్చాను...నాకు వీటిపై గోల్డ్ లోన్ ఇస్తే మరో 20 ఆవులు కొని నా వ్యాపారాన్ని విస్తరిస్తాను’’ అని బెంగాల్ కు చెందిన యువ రైతు మణప్పురం ఫైనాన్స్ ఉద్యోగులను అభ్యర్థించాడు.
 
బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలతో ప్రతిరోజూ రైతులు వచ్చి తమ వద్ద ఉన్న ఆవులపై ఎంత రుణం వస్తుందని ప్రశ్నిస్తున్నారని గరల్ గాచా గ్రామ పంచాయతీ ప్రధాన్ మనోజ్ సింగ్ చెప్పారు. తమ ఆవు రోజుకు 15 నుంచి 16 లీటర్ల పాలు ఇస్తుందని, పాలల్లో బంగారం ఉన్నందున తమ ఆవులపై ఎంత గోల్డ్ లోన్ వస్తుందని రైతులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆవు పాలల్లో బంగారం ఉందని కనుగొన్న దిలీఫ్ ఘోష్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని గ్రామ ప్రధాన్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal man  gold loan  cows  dilip ghosh  Manappuram Finance  West Bengal  BJP  Trinamul congress  politics  

Other Articles