samna editorial on president rule in maharashtra ‘రాష్ట్రపతి బీజేపి కంట్రోల్ లో వున్నారా.?’ బీజేపిని ప్రశ్నించిన సామ్నా

Bjp threatening us as mughals did shiv sena slams ally over call for president s rule

BJP, Shiv Sena, Maharashtra government formation, Devendra Fadnavis, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

In an editorial in its mouthpiece Saamana, Shiv Sena compared BJP's "threat" of President's rule in Maharashtra to one issued by the Mughals. Shiv Sena was reacting to BJP's Sudhir Mungatiwar statement that Maharashtra may head for President's rule if the new government in the state is not in place by November 7.

‘రాష్ట్రపతి బీజేపి కంట్రోల్ లో వున్నారా.?’ బీజేపిని ప్రశ్నించిన సామ్నా

Posted: 11/02/2019 11:02 AM IST
Bjp threatening us as mughals did shiv sena slams ally over call for president s rule

మహారాష్ట్రలో మిత్రపక్ష కూటమి బీజేపి-శివసేన పార్టీల మధ్య సయోధ్య కుదిరకపోగా.. రానురాను వారి మధ్య మరింత అంతరం పెరుగుతూపోతోంది. బీజేపికి చెందిన నేత చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న శివసేన.. రాష్ట్ర బీజేపి భుజాలపై తమ కలాన్ని ఎక్కుపెట్టి.. ఏకంగా జాతీయ బీజేపిని విమర్శించింది. రాష్ట్రపతి మీ కంట్రోల్ లో వున్నారా.? అంటూ ప్రశ్నించిన శివసేన.. మరో అడుగుముందుకేసీ రాష్ట్రపతి స్టాంప్ బీజేపి కార్యాలయంలో వుందా.? అంటూ నిలదీసింది. బీజేపి బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో తమ పార్టీ లేదని, ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పుకే అధిక గౌరవం, అంతిమ గౌరవం లభిస్తుందని తేల్చిచెప్పారింది.

పది రోజుల ముందువరకు పాలు నీళ్లు మాదిరిగా కలసివున్న బీజేపి-శివసేన పార్టీలు.. ఉప్పు..నిప్పులా మారడానికి, అంతరం పెరిగిపోవడానికి కారణం అధికారమే కావడం గమనార్హం. మిత్రపక్ష కూటమిగా మహారాష్ట్ర ప్రజల తీర్పుకు వెళ్లిన ఈ రెండు పార్టీల కూటమికి ప్రజలు మరోమారు అధికారం అందించారు. గత పర్యాయం ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేసినా.. ఎన్నికల అనంతరం కూటమిలా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇంతవరకు బాగానే వున్నా.. గతంలో కంటే బీజేపికి ఎమ్మెల్యే స్థానాలు సంఖ్య తక్కువగా రావడం.. శివసేన పుంజుకోవడంతో అసలు సమస్య ఉత్పన్నమయ్యింది.

మహారాష్ట్రలో బీజేపి-శివసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడాలంటే.. తప్పకుండా అధికార పంపకం జరగాల్సిందేనని శివసేన డిమాండ్ చేస్తోంది. అయితే బీజేపి మాత్రం శివసేనకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మరో 14 మంత్రి పదవులను కూడా అందిస్తామని ప్రతిపాదన పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు బెట్టువీడకపోవడంతో.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి నెలకొంది.  మహారాష్ట్ర బీజేపీ కీలక నేతల్లో ఒకరైన సుధీర్ నిన్న మాట్లాడుతూ, నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శివసేన.. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం... ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన ఎడిటోరియల్ లో వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్ లో ఉన్నారా? అని ప్రశ్నించింది. మరో అడుగు ముందుకేసస్తూ రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ నిలదీసింది. బీజేపీ నేత సుధీర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమైనవని మండిపడింది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవ పరిచేలా ఉన్నాయని పేర్కొంది.

మహారాష్ట్రలో ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు కాలేదనేదే అసలైన ప్రశ్న అని సామ్నా తెలిపింది. దీనికి సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ హెచ్చరించడం మొఘల్ చక్రవర్తులు బెదిరించినట్టుందని విమర్శించింది. ఇలాంటి బెదిరింపులకు మహారాష్ట్ర భయపడదని.. అందులోనూ శివసైనికులు అసలు భయపడరని తెలిపింది. మన రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి అత్యున్నత వ్యక్తి అని... రాష్ట్రపతి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, యావత్ దేశానికి ప్రతినిధి అని చెప్పింది. ఈ దేశం ఏ ఒక్కరి జేబులో లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles