Marriage Event Turns Into Battle In Suryapet పెళ్లిలో చితక్కొట్టుకున్న వధూవరుల బంధువులు.. చిచ్చుపెట్టిన డీజే

Two families fight during wedding function in kodad suryapet

fight after marriage kodad, fight after marriage Thogarrai village, fight after marriage suryapet, fight during marriage telangana, DJ leads to fight in marriage, families fight during wedding, fight during wedding function, Thogarrai, Suryapet, Telangana, Crime

A wedding function turns like a battlefield. A small conflict has turned into a big fight between the family members of the bridegroom and bride. The two groups attacked each other with chairs and sticks. This incident that happened at Kodad in Suryapet

ITEMVIDEOS: పెళ్లిలో చితక్కొట్టుకున్న వధూవరుల బంధువులు.. చిచ్చుపెట్టిన డీజే

Posted: 11/01/2019 07:43 PM IST
Two families fight during wedding function in kodad suryapet

పెళ్లంటే పందిళ్లు, తప్పట్లు, తాళాలు ...మూడే ముళ్లు, ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్లు. అవును. పెళ్లి అనేది జీవితంలో ఒక తీయని జ్ఞాపకం. మూడుముళ్లతో ఏకమై, ఏడడుగులతో మొదలై నూరేళ్ల బంధానికి బాటలు వేసేది పెళ్లి. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా మలుచుకునే జ్ఞాపకం. అయితే ఇలాంటి పెళ్లిళ్లో బంధువుల కోలాహలం, పెళ్లి బాజాలతో సందడిగా కనిపించడం కామన్. కానీ కానిదాని కోసం కయ్యానికి కాలుదువ్వితే.. ఎంత చిత్రమోకదా.. ఆ జంటకు ఈ ఘటన చేదు జ్ఞాపకమే కదా..  అచ్చంగా అదే జరిగిందిక్కడ.

వివాహ వేడుక రణరంగంగా మారింది. చిన్న వివాదంతో మొదలైన గొడవ.. చిలికి, చిలికి వరుడు, వధువు బంధువుల మధ్య కొట్లాటకు దారితీసింది. కుర్చీలు, కర్రలతో రెండు వర్గాలుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా బయటపడింది. ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయికి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తోగరాయికి చెందిన యువకుడితో వివాహమయ్యింది. వరుడి నివాసంలో పెళ్లి తంతు ముగియగానే కొత్త జంటను ప్రకాశం జిల్లాలోని వధువు ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అయితే వరుడి తరపు బంధువులు మాత్రం బరాత్ నిర్వహించాలని పట్టుబట్టారు.. అందులోనూ డీజే కూడా ఉందని తమ సంతోషం కోసం కొద్దిసేపు సర్ధుకుపోవాలని కోరారు. కానీ దీనికి వధువు తరపు బంధవులు ఒప్పుకోలేదు. కోదాడ నుంచి ప్రకాశం జిల్లాకు చాలా సమయం పడుతుందని.. ఇక డీజే పెడితే కాలాతీతం అవుతుందని చెప్పారు. బరాత్ వద్దని చెప్పి కొత్త జంటను తీసుకువెళుతుండగా.. అబ్బాయి తరఫు బంధువులు అడ్డుకున్నారు. వరుడు, వధువు తరపు బంధువుల మధ్య మాటా మాటా పెరిగి తోపులాటకు దారి తీసింది.

దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాలు దాడికి తెగబడ్డారు. కుర్చీలు, చేతికి దొరికిన వంట సామాను తీసుకొని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కుర్చీలు ఒకరిపై మరొకరు విసురుకున్నారు.. రెండు వర్గాలను ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. రెండు వర్గాల కొట్లాటతో పెళ్లితో సందడి వాతావరణం కనిపించాల్సిన ఇల్లు.. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. తర్వాత రంగంలోకి దిగిన ఇరు వర్గాల పెద్దలు.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles