Telangana govt to hike liqour rates by 20 percent తెలంగాణ మద్యానికి కిక్కు ఎక్కువ.. ఎందుకంటే..

Telangana govt to hike liqour rates by 20 percent

liquor prices to be hiked in telangana, liquor rates to hike, beer prices to be hiked, Christmas, New Year, excise policy, Two Years, liquor rates, beer price hike, Excise department, Telangana

According to sources, Telangana government likely to hike the rates of liquor and beer by nearly 20 percent from December.

తెలంగాణ మద్యానికి కిక్కు ఎక్కువ.. ఎందుకంటే..

Posted: 11/01/2019 05:50 PM IST
Telangana govt to hike liqour rates by 20 percent

తెలంగాణ రాష్ట్రంలోని ఏ మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసినా.. మర్చిపోలేని కిక్కు మీ సొంతం. అదెలా సాధ్యం అంటారా.? కొత్త సీసాలో పాత మందు పోసినట్ల.. ప్రతీ రెండేళ్లకు ప్రభుత్వం తమ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావడం.. ఈ పేరుతో మద్యం దుకాణాల నిర్వహణ, మద్యం అమ్మకాలు చేతులు మారడం కామన్ గా మారింది. ఈ తంతులో భాగంగా మద్యం దుకాణాలను కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాధి మందికి వేల సంఖ్యలోనే దుకాణాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ధరఖాస్తుకు రెండు లక్షల రూపాయల మేర రుసుమును విధించిన ప్రభుత్వం తమ ఖజానాను నింపుకుని.. 1467 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూర్చుకుంది. ఒక్కో మద్యం దుకాణ నిర్వాహకుడు ఏకంగా యాభై దుకాణాలకు ధరఖాస్తులు తీసుకుని అప్లై చేస్తే ఒక్క దుకాణం మాత్రమే వచ్చింది. అంటే కోటి రూపాయల మేర డబ్బులు పెడితే ఒక్క మద్యం షాపు మాత్రమే లభించింది. ఇది చాలదన్నట్లు స్థానికంగా మద్యం దుకాణాల యజమానులకు అద్దెలు కూడా చెల్లించాలి, అవి కూడా బారెడు వుంటాయి. దీనికి తోడు దుకాణంలో వుండే సిబ్బంది జీతబెత్యాలు, ఇలా అన్నీ వెరసి మద్యం దుకాణంలోని అమ్మాకాలతోనే మొత్తం తన డబ్బును రాబట్టుకోవాల్సి వుంటుంది.

అయితే లక్ష నుంచి రెండు లక్షలకు మద్యం దుకాణాల అప్లికేషన్లు పెంచడం వెనుక మద్యం రిటైల్ అమ్మకం దారులకు లబ్ది చేకూర్చే ప్రయత్నం కూడా వుందని స్పష్టమవుతోంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ నాటికి సందట్లో సడే మియా అన్న చందంగా మద్యం ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితికిగాను (2019-21) ఎక్సైజ్‌ శాఖ ఈ పాలసీని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,216  దుకాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 19 డిపోల ద్వారా వీటికి మద్యం సరఫరాకు ఏర్పాట్లు చేసింది.

2021 అక్టోబరు 31 వరకు అమల్లో ఉన్న కొత్తపాలసీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1467 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. దీనికి అదనంగా మద్యం ధరలను కూడా పెంచి మరికొంత ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకుగాను ఇటీవల ఏపీ ప్రభుత్వం తన కొత్త మద్యం విధానంలో 15 నుంచి 20 శాతం ధరలు పెంచడంతో, అదే విధానాన్ని తాము కూడా ఆచరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, దుకాణాల నిర్వహణకు ఎవరూరాని చోట్ల ప్రభుత్వమే దుకాణాలు నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Christmas  New Year  excise policy  Two Years  liquor rates  beer price hike  Excise department  Telangana  

Other Articles