TSRTC Strike: Driver attempts suicide in Shadnagar తాత్కాలిక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. కరీంనగర్ లో ఉద్రిక్తం..

Tsrtc strike tension prevails in karimnagar temporary driver attempts suicide

TSRTC Workers, TSRTC Strike, RTC Driver Khaja, Shadnagar depo, pesticides, Mahabubnagar government hospital. High Court, workers apology, RTC employees apologize, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

The TSRTC drivers, conductors, and other staff are continuing their strike demanding RTC merge in the government. a temporary driver Khaja working at Shadnagar deport has attempted suicide by consuming pesticides. The fellow staff who noticed rushed him Mahabubnagar government hospital.

టీఎస్ఆర్టీసీ సమ్మె: తాత్కాలిక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. కరీంనగర్ లో ఉద్రిక్తం..

Posted: 11/01/2019 06:47 PM IST
Tsrtc strike tension prevails in karimnagar temporary driver attempts suicide

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించి అర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన కేసీఆర్ సర్కార్ ముందు పెడుతున్నారు. మరోవైపు ఈ పోరాటంలో పలువురు కార్మికులు సమిధలవుతున్నారు. తెలంగాణ కోసం తొలి ఉధ్యమం ముగిసిందని, ఇది తమ ఉనికి కోసం మలి ఉధ్యమం అంటూ నినదిస్తున్న కార్మికులు.. గత 28 రోజులుగా ప్రభుత్వం ముందు తమ 26 డిమాండ్లను పెట్టి సమ్మెచేస్తున్నారు.

అయితే ఈ పోరాటానికి ఫలితం మరోలా వుంటుందని.. ఇక ఆర్టీసీ కథే ముగిసిందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. కొందరు కార్మికులు మానసిక అందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆత్మహత్యలకు పూనుకొగా, మరికోందరు అందోళన ఎక్కువై గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలా మరణించిన ఎన్ బాబు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించే క్రమంలో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ బండి సంజయ్ సహా బీజేపి నేతలు బయటకు వచ్చి తమను అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికులే కాదు తాము తాత్కాలిక డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్న ఖాజా ఇవాళ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఉద్యమానికి తాను అండగా నిలుస్తున్నానని పలు రోజులుగా సమ్మె శిబిరానికి వస్తున్న ఖాజా ఇవావా తనతో పాటు క్రిమిసంహారక మందును తీసుకొని వచ్చాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని శంషాబాద్ డిఫోలో విధులు నిర్వహిస్తున్న ఖాజా తన చేతిలోని పురుగుల మందును తాగాడు. దీనిని గమనించిన కార్మికులు వెంటనే ఖాజాను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  TSRTC Strike  RTC Driver  Khaja  Shadnagar  Ashwathama Reddy  CM KCR  TRS Government  Telangana  

Other Articles