singareni union leader mallaiah fires on Kavitha కల్వకుంట్ల కవితపై సింగరేణి కార్మిక సంఘం నేత ఫైర్.!

Singareni union leader mallaiah fires on kavitha

kengarla mallaiah, Kalvakuntla Kavitha, workers union, Singareni workers, Singareni colonies, Kothagudem, Telangana, Politics

After Joining the Bharatiya Mazdoor Sangh affiliated to the BJP last week, TBGKS Former working president Kengarla Mallaiah slammed Kalvakuntla kavitha and CM KCR who were backing mediators than Union workers.

కల్వకుంట్ల కవితపై సింగరేణి కార్మిక సంఘం నేత ఫైర్.!

Posted: 10/30/2019 04:27 PM IST
Singareni union leader mallaiah fires on kavitha

నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్యనేత, తెలంగాణ ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవితపై సింగరేణి కార్మిక సంఘం నాయకుడు కెంగర్ల మలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ స్ఫూర్తితో తాను ముందుకువస్తే.. పైరవీకారులను తెలంగాణ ఉద్యమ నేతలు ముందుకు తీసుకెళ్లారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులోనూ కవితను నమ్మి తాము తీవ్రంగా నష్టపోయానని చెప్పుకోచ్చారు. డబ్బుపోతే ఫర్వాలేదని చెప్పిన ఆయన.. అమె వల్ల తాను మనసిక క్షోభకు కూడా గురయ్యామని మల్లయ్య ఆరోపించారు.

కవిత కారణంగానే తానిప్పుడు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) కార్మికసంఘం కండువా కప్పుకోవాల్సి వచ్చిందని కెంగర్ల మల్లయ్య వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే బొగ్గుగని కార్మిక సంఘాని స్థాపించి, దానికి నాయకత్వం వహించానని చెప్పారు. అయితే తనను ఎన్నో అవమానాలకు గురి చేశారని.. అడుగడుగునా తాను పరాభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తే.. వాళ్లు ఫైరవీకారులకు పగ్గాలను అప్పగించారని అరోపించారు.

చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్లుగా.. టీబీజీకేఎస్‌లో చొరబడ్డ కొన్ని శక్తులు యూనియన్‌ను చిన్నాభిన్నం చేశాయని మల్లయ్య మండిపడ్డారు. గత నెలలో కెంగర్ల మల్లయ్య తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రాజీనామా చేసి తన అనుచరులతో కలసి బీఎంఎస్ యూనియన్లో చేరిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పైనా మల్లయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌లో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి లేదని... ఆయన తిరిగి ఆ స్పూర్తిని పొందడం సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. సింగరేణిలోని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు కవిత గతంలో గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles