ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దుమారం కొనసాగుతోంది. ఇసుక కొరత వల్ల నిర్మాణపు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భవననిర్మాణ కూలీ ఆత్మహత్య కలకలం రేపింది. ఇసుక కొరతపై ప్రతిపక్ష టీడీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇసుక కొరత నెలకొందని ఆరోపిస్తోంది. ఇసుక కొరతను నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ ధీక్ష.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.
నారా లోకేష్ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి లోకేష్ దీక్షలో కూర్చున్నారు. ఇసుక ప్యాకెట్లను దండలుగా వేసుకుని టీడీపీ నేతలు దీక్షకు దిగారు. నారా లోకేష్ మెడలో నల్లకండువా కప్పుకుని నిరసన తెలియజేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరి, మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఆయనకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చున్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో గుంటూరు కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడాయి.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తూనే గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. జగన్ సర్కార్ తెచ్చిన నూతన విధానంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రతరమైంది. గత కొద్ది నెలలుగా ఇసుక లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.
గతంలో ఇసుక ట్రాక్టర్ ధర రూ.2 వేల లోపు ఉండేదని, ఇప్పుడు అది రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పలుకుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంటే పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిపోతోందని చెబుతోంది. ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. అధికార పార్టీ నేతలు జేబులు నింపుకునేందుకు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Feb 25 | కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే... Read more
Feb 25 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా... Read more
Feb 25 | కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో... Read more
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more
Feb 25 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో... Read more