psycho chops a girl to death for rejecting his love ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

Psycho chops a girl to death for rejecting his love in west godavari

psycho chops girl to death, psycho chops collage student to death, psycho kills girls for rejecting love, married and divorced psycho, psycho lover, sudhakar reddy, kavitam village, pudur, West Godavari, Crime

A heinous crime took place at Pudur in West Godavari district where a man named Sudhakar Reddy attacked a Diploma student of Kavitam village in est Godavari with a knife for rejecting his love. Sudhakar Reddy, who is already married, divorced his first wife has been following the girl in the name of love for quite some time.

ప్రేమోన్మాధి ఘాతుకం: ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి

Posted: 10/16/2019 11:46 AM IST
Psycho chops a girl to death for rejecting his love in west godavari

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను యువతిని నిరాకరించిందన్న అక్కస్సుతో యువతిపై కత్తితో దాడి చేశాడు. తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించి తాను కూడా విషం తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన యువతితో పాటు విషం తాగిన ప్రేమోన్మాదిని కూడా స్థానికులు అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం కవిటంలో ఈ దారుణఘటన చోటుచేసుకుంది. పచ్చని పైరుతో నిత్యం కళకళలాడే జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన జరగడం సంచలనంగా మారింది. ఘటనపై సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రేమోన్మాది వున్న అసుపత్రి వద్ద కానిస్టేబుల్ ను కాపలా పెట్టారు. ప్రేమోన్మాది దాడికి వినియోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి గతంలో పెళ్లి కాగా భార్యకు విడాకులు ఇచ్చాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో తేజస్విని అనే యువతిని వేధిస్తున్నాడు. వివాహం చేసుకుంటానని నిత్యం ఆమె వెంట పడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్న సుధాకర్ మాటు వేసి యువతి కాలేజీకి వెళ్తుండగా బస్టాప్ లో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడింది. దాడి చేసిన అనంతరం అతను పురుగుల మంద తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.  .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : psycho lover  sudhakar reddy  kavitam village  pudur  West Godavari  Crime  

Other Articles