RBI stops printing Rs 2000 notes అలర్ట్: రూ. 2వేల నోటు.. ఏక్షణమైనా రద్దు..

Rbi has not printed a single 2000 rupee note this fiscal year

Centre to demonetise rs 2000, RBI to demonetise rs 2000 note, single Rs 2000 note not printed this fiscal year, RBI, 2000 notes, RTI, NIA, fake notes, black money, RTI query, bank notes, fake currency

The RBI has stopped printing Rs 2,000 currency notes, citing a Right To Information response. The Bharatiya Reserve Bank Note Mudran has not printed a single Rs 2,000 note this financial year.

అలర్ట్: రూ. 2వేల నోటు.. ఏక్షణమైనా రద్దు..

Posted: 10/16/2019 10:13 AM IST
Rbi has not printed a single 2000 rupee note this fiscal year

దేశ ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో పెట్టింది పేరు. అంతేకాదు ఆయన సాహసోపేత నిర్ణయాలు తీసుకునే వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం కూడా అందదు. ఇలాంటి నిర్ణయాలతో ధాయాది పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్, చేసినా.. వాయువేగంతో దాడి చేసినా అవి జరిగిన తరువాత కానీ ప్రజలకు సమాచారం తెలియదు. అయితే ప్రధాని తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? అంటే ఔనన సమాధానాలే వినిపిస్తున్నాయి.

తన హాయంలో ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును బ్యాన్ చేస్తారన్న వార్తలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు పేరుతో మునుపెన్నడూ లేని విధంగా రూ.2 వేల నోటును చలామణిలోకి తీసుకువచ్చారన్న విపక్షాల విమర్శలకు ఆయన చెక్ పెట్టనున్నారా.? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల నోటు మార్కెట్ లో కనిపించడం లేదు.  జనాలు రూ.2వేల నోటు చూసి చాలా రోజులే అయ్యింది.

ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా ఆర్బీఐ తాజాగా అందించిన సమాచారం కూడా కీలకమే అయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రించలేదనే నిజం వెలుగులోకి సమాచార హక్కు చట్టం కింద ఓ ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. దీంతో ఏ క్షణమైనా రూ.2వేల నోటుని రద్దు  చేశాము అనే ప్రకటన ప్రభుత్వం నుంచి రావొచ్చనన్న అందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇక ఏటీఎంలలోనూ రూ.2 వేల క్యాసెట్లు తోలగిస్తున్నారన్న వార్తలు కూడా దీనికి అజ్యం పోస్తున్నాయి,

ఆర్టీఐ సమాచారం ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ  2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. 2019లో మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం  చేసింది. దీంతో రూ.2వేల నోట్లు రద్దు కానున్నాయా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  2000 notes  RTI  NIA  fake notes  black money  RTI query  bank notes  fake currency  India  

Other Articles