pawan kalyan condemns murder of reporter పాత్రికేయుడి హత్యను తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్

Killing of journalist a barbaric act pawan kalyan

pawan kalyan condemns scribe murder, pawan kalyan condemns journalist murder, pawan kalyan suspects conspiracy behind scribe murder, janasena condemns andhra jyothy reporter murder, pawan kalyan, janasena, k. satyanarayana, andhrajyothy reporter, thondangi, journalist murdered, andhra pradesh, crime

Jana Sena Party president Pawan Kalyan strongly condemned the ghastly murder of andhra jyothy reporter k satyanarayana of thondangi mandal and suspected conspiracy behind.

పాత్రికేయుడి హత్యను తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్

Posted: 10/15/2019 10:34 PM IST
Killing of journalist a barbaric act pawan kalyan

తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ హత్యను యావత్ రాష్ట్రం ముక్తకంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుండే పాత్రికేయులపై కక్షగట్టి ఇలాంటి దారుణాలకు పాల్పడటం  ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి దారుణహత్యలతో సత్యాన్ని వెలుగులోకి రానీయకుండా అపలేరని పేర్కోన్నారు.

నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులనే అంతమొందించే అగంతకుల తెగువ చూస్తుంటే మనం అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా అన్న అనుమానాలు కలుగక మానవని వ్యాఖ్యానించారు. కాతా సత్యనారాయణపై జరిగిన దారుణ హత్య ఒక్క పాత్రికేయుడిపైన జరిగినట్టు కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో మూల స్థంభంగా నిలిచే జర్నలిజంపేనే జరిగినట్టుగా ఉందని ఆయన పేర్కోన్నారు.

భయంకరంగా భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమని నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సత్యనారాయణ ఇంటికి కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు తెగించారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని అనుమానించక తప్పదని పేర్కొన్నారు. సత్యనారాయణపై నెల కిందటే ఒకసారి హత్యాయత్నం జరిగిందనా.. అతనికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు.

గతంలో జరిగిన హత్యాయత్న ఘటనపై పోలీసులు తగు చర్యలు తీసుకుని వుండివుంటే ఇలాంటి దారుణఘటన చోటుచేసుకుని వుండేది కాదన్నారు. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన ఇవాళ రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా విలేకరి హత్య వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు. సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని అందించాలని కోరారు. విలేకరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles