వైద్యో నారాయణో హరి అనే నానుడికి పరాకాష్ట ఈ ఘటన. వైద్యుడిని దేవుడితో పోల్చడం అటుంచితే వైద్యడిని వద్దకు చికిత్స కోసం వెళ్లిన రోగిపై పైశాచికత్వం చేయడమే కాకుండా అమెను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. మహిళా రోగిపై ఓ డాక్టర్ పాశవికంగా అత్యాచారం జరపడం కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ముంబైలోని జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (27) పైల్స్ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం అదే ప్రాంతంలో ఉన్న డాక్టర్ వంశరాజ్ ద్వివేది క్లినిక్ కు వచ్చింది. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 45 నిమిషాల పాటు నిద్రపోవాలని ద్వివేది సూచించాడు. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు.
ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలికి పంపి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ద్వివేది ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత ఆమె ఓ యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెను బెదిరించాడు. ద్వివేది బెదిరింపులను తట్టుకోలేకపోయిన ఆమె... జరిగిన విషయాన్ని తన భర్తతో చెప్పింది. అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ద్వివేదిని అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 02 | తెలంగాణ ఇంటి కోడలినంటూ అదే మెట్టినిల్లు లాజిక్ తో ఇక్కడి రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగప్రవేశం చేయునున్న వైఎస్ షర్మిల ఇప్పటికే జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. ఇక... Read more
Mar 02 | ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బెయిల్ ష్యూరిటీ విషయంలో ఆయన ఎదుర్కోంటున్న ఇబ్బందులను ఆయన తరపు సినియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ బాంబే... Read more
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more