Chiranjeevi meets AP CM YS Jagan ఏపీ సీఎంతో చిరంజీవి దంపతుల భేటి..

Megastar chiranjeevi along with his wife meets ap cm ys jagan

Megastar Chiranjeevi, Konidela surekha, Sye raa Narasimha Reddy, YS Jagan, chief minister, ram charan, historical movie, Andhra pradesh, Politics, Tollywood, movies, Entertainment

AP CM YS Jaganmohan Reddy has been warmly met by the megastar Chiranjeevi. Chiranjeevi, who arrived in Vijayawada on a special flight from Hyderabad. Aong with his wife Surekha, Chiru' went to the residence of CM Jagan at Tadepally.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

Posted: 10/14/2019 03:58 PM IST
Megastar chiranjeevi along with his wife meets ap cm ys jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. తన కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న చిరంజీవి.. సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి తనను కలిసేందుకు రావడంతో.. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయ వర్గాలను ఆయనను సాదరంగా అహ్వానించాయి. ఇక తన కార్యాలయంలోకి చేరుకున్న చిరంజీవిని.. జగన్ శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా చిరంజీవి కుటుంబసభ్యులు శాలువాతో సత్కరించారు. జగన్‌తో పాటూ ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. అనంతరం జగన్‌, మెగాస్టార్ దంపతులతో భోజనం చేశారు. అనంతరం ఇద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తాను నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని జగన్‌ను కోరారు. సీఎం కోసం ప్రత్యేక షోను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అంతకముందు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తర్వాత చిరంజీవి దంపతులు విజయవాడలోని తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు అక్కడి గడిపి.. అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకొన్నారు. అంతేకాదు చిరు వెంట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జగన్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా.తన నటనతో ఆకట్టుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sye raa narasimha reddy  YS Jagan  chief minister  Chiranjeevi  surekha  andhra pradesh  Politics  tollywood  

Other Articles