233 applications tendered for liqour shops on 9th Sep తెలంగాణలో మద్యం దుకాణాలకు సెంటిమెంట్..

Amid additional taxes hiked licence fee 233 applications tendered on first day

Telangana government, Liquor shop, Liqour shop Licence Period, Retail Liqour Shop, Retail Liqour Shop Excise Tax, liquor shops tax, Revenue Department, telangana news excise policy, V.Srinivas Goud, Telangana government, Excise Tax, liquor shops, Revenue Department, telangana new excise policy

The new liquor policy of Telangana has hiked licence application fees and has laid down new excise tax brackets for liquor shops. Amid price hike liquor shop owners compete to acquire shops from the 1st day itself.

తెలంగాణలో మద్యం దుకాణాలకు సెంటిమెంట్..

Posted: 10/10/2019 04:57 PM IST
Amid additional taxes hiked licence fee 233 applications tendered on first day

తెలంగాణ రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో ఈ నెల 10 నుంచి రెండేళ్ల పాటు మద్యం దుకాణాలకు నిర్వహణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తొలిరోజునే మద్యం వ్యాపారుల నుంచి అమిత స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2 లక్షల వెనక్కు తిరిగి ఇవ్వబడని డిపాజిట్ తో దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించగా, తొలి రోజున 233 దరఖాస్తులు వచ్చాయి.

ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాల ధరఖాస్తులను సైతం ప్రభుత్వం రెట్టింపు చేసింది. అయినా మద్యం వ్యాపారులు పోటీ పడి మరీ ధరఖాస్తులను తీసుకుంటున్నారు. 2017కు ముందు ఒక్క ధరఖాస్తును రూ.50 వేలు వుండగా, 2017లో దీనిని రూ.లక్షకు పెంచిందీ ప్రభుత్వం. కాగా తాజాగా నూతన మద్యం పాలసీలో భాగంగా ఒక్కో దరఖాస్తును రూ. లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మందుబాబులకు డోకా లేకపోవడంతో.. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు నెలకొన్న పోటీలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ధరఖాస్తుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొత్త మద్యం దుకాణాల నిర్వహణ దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 16 బుధవారం వరకు సమయం ఉన్నప్పటికీ, విజయదశమి తరువాతి రోజున ఏకాదశి కావడంతో వ్యాపారులు తమ టెండర్లను వేశారు. విజయ ఏకాదశి రోజున టెండర్ల వేస్తే తమకే దుకాణం లక్కీ లాటరీలో వస్తుందన్న సెంటిమెంటుతో మద్యం దుకాణాదారులు టెండర్లు వేసేందుకు పోటీ పడ్డారు. దీంతో తొలిరోజునే ఏకంగా 233 టెండర్లు ను రాష్ట్ర వ్యాప్తంగా వున్న మద్యం వాప్యారులు సమర్పించారు.

తొలి రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌ కు వచ్చిన ఆయన, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిటైల్‌ వైన్‌ షాప్‌ ల దరఖాస్తులను స్వీకరిస్తున్న ఏర్పాట్లపై ఆయన చర్చలు జరిపారు. మొత్తం 33 జిల్లాల్లో 34 దరఖాస్తు స్వీకరణ ఏర్పాట్లు చేశామని, మొత్తం విధానాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles