గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని గోల్డ్ స్టార్ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అమరావతి మండలం జూపూడి గ్రామానికి చెందిన యువకుడు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు సమీపంలో గొల్లగూడెం గ్రామానికి చెందిన యువతి ఇద్దరూ ఈ లాడ్జీలోకి వచ్చి విగత జీవులుగా మారారు. వీరిద్దరు ప్రేమించుకున్నారని.. పెద్దల అంగీకారం లేకపోవడంతోనే వారు బలన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు.... జూపూడికి చెందిన ఏకుల సాగర్‌బాబు (25), గొల్లగూడెంకు చెందిన గాలంకి తేజస్వి (23) బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెనాలి వచ్చారు. ఓవర్ బ్రిడ్జి వైపు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డులోని ఓ లాడ్జికి వెళ్లి రూం తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవుతున్నా ఉలుకూ పలుకు లేకపోవడంతో, అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపు సందులో నుంచి గదిని పరిశీలించారు. మంచంపై తేజస్వి అచేతనంగా పడి ఉంది. అలానే గదిలో రక్తం కారి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు వెళ్లి తలుపులు తెరచి చూడగా, తేజస్వి ఎడమ చేతి మణికట్టు వద్ద గాయమై మంచంపై మృతి చెంది ఉంది. సాగర్‌బాబు బాత్‌రూమ్‌లో మృతి చెంది పడి ఉన్నాడు. గదిని పరిశీలించిన పోలీసులు పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగడమే కాకుండా, తేజస్వి చేయి కోసుకుంది. త్రీ టౌన్ ఎస్‌ఐ చల్లా సురేష్ మతదేహాలను పరిశీలించారు. లభించిన ఓటరుకార్డు, లాడ్జి సిబ్బందికి ఇచ్చిన ఫొటో ఐడీ ఆధారంగా మృతులను గుర్తించారు.
ఈ నెల 7వ తేదీన కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో తేజస్వి మిస్సింగ్ కేసు నమోదైనట్టు తెలిసింది. వీరిద్దరూ ప్రేమికులా, లేక బంధువులా అన్నది విచారణలో తెలియాల్సి ఉందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చామని తెలిపారు. వారు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతులిద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని పేర్కొన్నారు. సాగర్‌బాబుకు వివాహమయి, ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భవతి అని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more