increase of water levels in river godavari ఎగువన వర్షాలతో గోదావరిలో పెరిగిన నీటిమట్టం

Transportation cut to 9 villages due to increase of godavari water levels

Godavari river, water levels, transportation, boat capsizes in Godavari river, sight seeing boat capsizes, CM Jagan, Twitter, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

Water levels in River Godavari raise due to rains in the catchmentarea which stops the transportation to 9 villages of East Godavari. It also srops the removal of royal vasista boat, which capsized at kachhakuru of devipatnam mandal.

గోదావరిలో పెరిగిన నీటిమట్టం.. రాయల్ వశిష్ట వెలికితీతకు అంతరాయం

Posted: 10/03/2019 01:35 PM IST
Transportation cut to 9 villages due to increase of godavari water levels

గోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఎగువన నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గోదావరి వరద పెరిగినప్పుడల్లా తమకీ సమస్య తప్పడం లేదని వారు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తమ గ్రామాలకు రాకపోకలు మృగ్యమవుతాయని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ గ్రామాలు కూడా వరద ముంపులో చిక్కుకోవడం తప్పదని తెలిపారు. వరదలో చిక్కుకున్నన్నాళ్లు ఇబ్బందులేనని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక గోదావరిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో దేవీపట్నంలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది.

గోదావరిలో వరద  ఉద్ధృతి పెరగడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం పనులు నిలిపివేసింది. పాపికొండల అందాలు తిలకించేందుకు ఉత్సాహపడిన పర్యాటకులతో బయలుదేరిన వశిష్ట రాయల్‌ బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 26 మంది బతికి బయటపడగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మృతదేహాల ఆచూకీ కూడా లభించక పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ వారి చివరి చూపుకోసం ఎదురు చూస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన సత్యం బృందానికి బోటు వెలికితీత బాధ్యతలు అప్పగించింది. రెండు రోజుల క్రితం రెండు కిలోమీటర్ల ఇనుపతాడు నదిలోకి జారవిడిచిన బృందం లంగరుకు ఏదో బరువైన వస్తువు తగలడంతో దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అయితే రోప్‌ తెగిపోవడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. మళ్లీ నిన్నటి నుంచి వెలికితీత ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గోదావరిలో వరద పెరగడంతో మళ్లీ వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari river  water levels  transportation  devipatnam  boat capsizes  East Godavari  Andhra Pradesh  Crimeగోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఎగువన నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద పెరిగినప్పుడల్లా తమకీ సమస్య తప్పడం లేదని వారు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తమ గ్రామాలకు రాకపోకలు మృగ్యమవుతాయని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ గ్రామాలు కూడా వరద ముంపులో చిక్కుకోవడం తప్పదని తెలిపారు. వరదలో చిక్కుకున్నన్నాళ్లు ఇబ్బందులేనని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక గోదావరిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో దేవీపట్నంలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది. గోదావరిలో వరద ఉద్ధృతి పెరగడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం పనులు నిలిపివేసింది. పాపికొండల అందాలు తిలకించేందుకు ఉత్సాహపడిన పర్యాటకులతో బయలుదేరిన వశిష్ట రాయల్‌ బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 26 మంది బతికి బయటపడగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మృతదేహాల ఆచూకీ కూడా లభించక పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ వారి చివరి చూపుకోసం ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన సత్యం బృందానికి బోటు వెలికితీత బాధ్యతలు అప్పగించింది. రెండు రోజుల క్రితం రెండు కిలోమీటర్ల ఇనుపతాడు నదిలోకి జారవిడిచిన బృందం లంగరుకు ఏదో బరువైన వస్తువు తగలడంతో దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అయితే రోప్‌ తెగిపోవడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. మళ్లీ నిన్నటి నుంచి వెలికితీత ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గోదావరిలో వరద పెరగడంతో మళ్లీ వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.  

Other Articles