Devotees witness rare event at Arasavalli అరసవల్లిలో అద్భుతఘట్టం అవిష్కృతం..

Sun rays touch arasavalli deity for nine minutes

Devotees, Arasavalli, Sri Suryanarayana Swamy, Sun rays, miracle, phenomenal event, Srikakulam, Andhra pradesh

The Sun God temple in Arasavalli witnessed devotees rush on Wednesday to witness the phenomenal event of sun rays touching the presiding deity of Sri Suryanarayana Swamy shrine.

అరసవల్లిలో అద్భుతఘట్టం అవిష్కృతం.. భక్తజన పారవశ్యం..

Posted: 10/02/2019 12:37 PM IST
Sun rays touch arasavalli deity for nine minutes

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పాదాలను భాస్కరుడు తాకి.. ఆ తరువాత విగ్రహం పై భాగానికి చేరకున్నాడు. తన లేలేత కిరణాలతో భానుడు స్వామివారి విగ్రహాన్ని స్పర్శించి దర్శనం చేసుకుని పులకించాడు. పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకిన అద్భుత ఘట్టం ఈరోజు ఆవిష్కృతం అయ్యింది.

ఈ దివ్య ఘట్టాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో ఇక్కడకు వచ్చిన భక్తజన సమూహం భక్తి పారవశ్యంలో మునిగాపోయారు. స్వామి వారి విగ్రహంపై అదిత్యుని కిరణాలు తాకగానే.. ఆలయంలోని మూలవిరాట్టు స్వర్ణవర్ణంలోకి మారి దేదీప్యమానంగా భక్తులకు అభయప్రధానం చేశారు. ఈ సమయంలో ప్రత్యక్ష భగవానుడి నామస్మరణ చేస్తూ భక్తులు పులకరించిపోయారు. ఈ దివ్యసుందర ఘట్టాన్నిభక్తులందరూ వీక్షించేందుకు అదిత్యుడు ఏకంగా అరునిమిషాల పాటు స్వామివారి విగ్రహాన్ని తాకుతూనే వున్నాడు.

రెండు రోజుల ముందుగానే ఇక్కడకు చేరుకున్న భక్తులు నిన్న స్వామివారిపై సూర్యకిరణాలు పడతాయని వేచి చూసినా.. భానుడు తాకకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. కాగా ఇవాళ తెల్లవారుజాము నుంచే ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దాదాపు ఆరు నిమిషాలు పాటు భక్తులకు ఈ దర్శన భాగ్యం కలిగింది. ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుడిని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా మార్చి 9,10 తేదీల్లో.. అలాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles