ISRO Efforts to Regain Link with Vikram will start: ISRO చంద్రయాన్-2 95 శాతం సక్సెస్: ఇస్రో చైర్మన్

Isro has not given up efforts to regain link with vikram lander

vikram lander whereabouts, chandrayaan 2 hopes, ISRO chairman Shivan, chandrayaan 2, chandrayaan 2 news, chandrayaan 2 update, chandrayaan 2 latest, chandrayaan 2 vikram, vikram landing photo, vikram photo, nasa chandrayaan 2 photo, ISRO Chairman, Vikram lander, ground station, landing, foreign affairs, politics

The Indian Space Research Organisation has not completely given up on attempting to re-establish communication with the Chandrayaan-2 lander Vikram that went silent during its lunar descent

ల్యాండర్ విక్రమ కోసం అన్వేషణ పున:ప్రారంభిస్తాం: ఇస్రో

Posted: 10/02/2019 11:43 AM IST
Isro has not given up efforts to regain link with vikram lander

భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలవాల్సిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి క్షణంలో కాస్తలో విఫలమైన విషయం తెలిసిందే. అయితే ల్యాండర్ విక్రమ్ మాత్రమే సక్రమంగా ల్యాండింగ్ కాలేదని.. చివరి క్షణంలో దాని నుంచి ఇస్రోలోని గ్రౌండ్ స్టేషన్ కు సమాచార సమన్వం దెబ్బతినిందని కూడా పేర్కోన్నారు. అయితే ఇస్రో శాస్తవేత్తలకు మాత్రం ల్యాండర్ విక్రమ్ పై ఇంకా ఆశలు సజీవంగానే వున్నాయని తాజాగా మరోమారు వెల్లడించారు.

తాము చంద్రుడి దక్షిణ ధ్రువం దిశగా పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ పనిచేస్తుందని, అయితే దాని నుంచి గ్రౌండ్ స్టేషన్ కు సమాచార సమన్వయం మాత్రమే కోల్పోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 14 రోజుల నిరీక్షణ, అన్వేషణ తరువాత కూడా విక్రమ్ ల్యాండర్ అచూకీ తెలియక పోవడంతో ఇక ఇప్పటికీ కథ ముగిసినట్టేనని పలు వార్తలు వస్తున్న క్రమంలో తాము ఇంకా విక్రమ్ ల్యాండర్ పై అశలు వదులుకోలేదని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు.

అయితే 14 రోజల పాటు విక్రమ్ అచూకీ కోసం అవిశ్రాంత అన్వేషణ కొనాసాగించా.. వారిలో మాత్రం ఇంకా ఆశలు విఫలం కాలేదు. తమ శ్రమ వృధాకాదని, మరో 14 రోజుల తరువాత ఫలితం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  చంద్రయాన్‌-2లో భాగంగా జూలై 22న చంద్రునిపైకి భారత్‌ ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ అన్ని దశలు దాటుకుని విజయవంతంగా చంద్రుని సమీపంలోకి చేరింది. ఈనెల 7వ తేదీన చివరి ఘట్టమైన ల్యాండింగ్‌ ప్రక్రియలో చివరి నిమిషంలో విక్రమ్ నుంచి సాంకేతిక సమస్వయం గ్రౌండ్ స్టేషన్ కు తెలిగిపోవడంతో దాని అచూకీ కోసం శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతోంది.

విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరణ గావించేందు తాము చేస్తున్న ప్రయత్నాలను ఆపలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాత్రి సమయం కావడంతో 10 రోజుల కిందట తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చామన్నారు. 14 రోజుల పాటు సాగే ఈ దశ వల్ల ల్యాండర్ విక్రమ్ కు సౌర శక్తి లభించదని చెప్పారు. మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక కమ్యూనికేషన్‌ సంబంధాల పునరుద్ధరణ కసరత్తును ప్రారంభిస్తామని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrayaan-2  Shivan  ISRO Chairman  Vikram lander  ground station  landing  moon south pole  politics  

Other Articles