Tirumala Srivaru on simha vahanam తిరుమల బ్రహ్మోత్సవాలు: సింహ వాహనంపై శ్రీవారు

Tirumala bramhostavam srivaru on simha vahanam as nrusimha swamy

tirumala,tirumala brahmotsavam, chinna shesha vahanam,hamsa vahanam.tirumala tirupati devasthanams,tirumala srivari brahmotsavam 2019,srivari brahmotsavam 2019,tirumala srivari brahmotsavam,brahmotsavam,srivari brahmotsavam,tirumala brahmotsavam 2019,tirumala tirupati brahmotsavam 2019,tirumala brahmotsavam 2019 schedule,tirumala brahmotsavam 2018,brahmotsavams 2019,tirumala brahmotsavam song,tirumala brahmotsavam 2018 dates

Tirumala Sri vari Brahmotsavam celebrations are being conduted on the third day, as a part srivaru paraded as nrusimha swamy on Simha Vahanam in the tirumada streets.

తిరుమల బ్రహ్మోత్సవాలు: సింహ వాహనంపై నృసింహునిగా శ్రీవారి ఊరేగింపు

Posted: 10/02/2019 10:54 AM IST
Tirumala bramhostavam srivaru on simha vahanam as nrusimha swamy

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాల మూడవ రోజును పురస్కరించుకుని దేవదేవుని ఇవాళ ఉదయం సింహవాహన సేవను తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తన దర్శనం కోసం మాడ వీధుల్లో అశేష సంఖ్యలో వేచిచూస్తున్న భక్తులకు స్వామివారు అభయప్రధానం చేశారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్త జనసందోహం పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకుంటున్నారు, దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం సింహ వాహనం. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. సింహబలమంత భక్తిబలం కలిగి ఉన్నవారికి స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు విహరించనున్నారు.

బ్రహ్మోత్సవాల మూడో రోజు ఉదయం సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో యోగా నృసింహుడిగా భక్తులకు అభయ ప్రధానం చేశారు. సింహవాహనంపై ఆ దేవదేవుని వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. నిన్న ఉదయం చిన్నశేష వాహనంపై వేణుమాధవుడిగా ఊరేగించిన శ్రీవారు నిన్న సాయంత్రం హంసవాహనంపై విహరించనున్నారు. కాగా తిరుమల కోండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సమయం కూడా అధికంగా పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65.028 మంది భక్తులు దర్శించుకోగా, 30,496 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala brahmotsavam  simha vahanam  Nrusimha avatar  tirumada streets  devotees  TTD  Devotional  

Other Articles