telangana high court stays demolition of secretariat కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో షాక్..

Telangana high court stays demolition of secretariat

ts secretariat demolition, TRS, Telangana Secretariat, Telangana High Court, kcr, Errum Manzil, Telangana, Politics

A two Judge Bench of the Telangana High Court comprising Chief Justice Raghavendra Singh Chauhan and Justice A Abhishek Reddy stayed the decision of demolition of Secretariat building by the government.

సచివాలయ కూల్చివేతకు బ్రేక్.. హైకోర్టులో కేసీఆర్ సర్కారుకు షాక్..

Posted: 10/01/2019 09:06 PM IST
Telangana high court stays demolition of secretariat

సచివాలయ భవనాల కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. కూల్చివేతను చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదివరకే ఒక సారి ఈ విషయమై స్పందించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దసరా సెలవుల తర్వాత కేసు విచారణ చేపడతామని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూల్చివేత ప్రక్రియ నిలిపేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అక్టోబర్ 14 వరకు సచివాలయం కూల్చివేత నిలిపేయాలని ఆదేశించింది.

పిటిషన్ విచారణ చేపట్టేంత వరకు ఎలాంటి కూల్చివేత చేపట్టరాదని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం నూతన అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. ఎర్రమంజిల్ ప్యాలెస్ స్థానంలో అసెంబ్లీని నిర్మించి.. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలోనే నూతన సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాల కూల్చివేతకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

దసరా నేపథ్యంలో పనులు ప్రారంభించాలని భావిస్తుండగా.. హైకోర్టు స్టే విధించడం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. సచివాలయం కూల్చివేతతో పాటు ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్యాలెస్ కూల్చివేతపైనా హైకోర్టు స్టే విధించింది. సెక్రటేరియట్ భవనాన్ని మాత్రం వీలైనంత త్వరగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాత సచివాలయాన్ని ఖాళీ చేసి, సమీపంలోని బీఆర్‌కే భవన్ నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : secretariat demolition  Telangana Secretariat  High Court  KCR  Errum Manzil  Telangana  Politics  

Other Articles