Tirumala Srivaru on chinna shesha vahanam తిరుమల బ్రహ్మోత్సవాలు: చిన్నశేష వాహనంపై శ్రీవారు

Tirumala bramhostavam srivaru on chinna shesha vahanam

tirumala,tirumala brahmotsavam, chinna shesha vahanam,hamsa vahanam.tirumala tirupati devasthanams,tirumala srivari brahmotsavam 2019,srivari brahmotsavam 2019,tirumala srivari brahmotsavam,brahmotsavam,srivari brahmotsavam,tirumala brahmotsavam 2019,tirumala tirupati brahmotsavam 2019,tirumala brahmotsavam 2019 schedule,tirumala brahmotsavam 2018,brahmotsavams 2019,tirumala brahmotsavam song,tirumala brahmotsavam 2018 dates

Tirumala Sri vari Brahmotsavam celebrations are being conduted on the second day, as a part on second day srivaru paraded on tirumada streets on chinna shesha vahana, and in the evening he will bless the devotees on Hamsa vahanam,

తిరుమల బ్రహ్మోత్సవాలు: చిన్నశేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు

Posted: 10/01/2019 09:22 AM IST
Tirumala bramhostavam srivaru on chinna shesha vahanam

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాల రెండో రోజును పురస్కరించుకుని దేవదేవుని ఇవాళ ఉదయం చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తన దర్శనం కోసం మాడ వీధుల్లో అశేష సంఖ్యలో వేచిచూస్తున్న భక్తులకు స్వామివారు అభయప్రధానం చేశారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకుంటున్నారు,

బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం ఆ దేవదేవుడు చిన్నశేష వాహనంపై విహరించారు. తిరు మాడ వీధుల్లో ఐదు తలల శేష వాహనంపై మలయప్పస్వామి వైభవాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. చిన్నశేష వాహనంపై గోవుల కాపరిగా, వేణుమాధవుడిగా శ్రీవారు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరించనున్నారు. కాగా తిరుమల కోండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సమయం కూడా అధికంగా పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65.028 మంది భక్తులు దర్శించుకోగా, 30,496 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala brahmotsavam  chinna shesha vahanam  hamsa vahanam  CM Jagan  silk robes  TTD  Devotional  

Other Articles