UAE petrol prices to fall in October ఇంధన ధరలకు రెక్కలోస్తాయ్.. హెచ్చరించిన సౌదీ

Saudi crown prince warns of unimaginably high oil prices

SAUDI Arabia, crown king, bin salman, Warning, unimaginably high, Fuel prices, IRAN, UAE, World, political solution

Saudi Arabia's crown prince warned that oil prices could spike to "unimaginably high numbers" if the world does not come together to deter Iran, but said he would prefer a political solution to a military one.

ఇంధన ధరలకు రెక్కలోస్తాయ్.. హెచ్చరించిన సౌదీ

Posted: 09/30/2019 03:49 PM IST
Saudi crown prince warns of unimaginably high oil prices

ప్రపంచ దేశాలను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేశారు. ఆయిల్ ధరలు రెక్కలోస్తాయని హెచ్చరించిన ఆయన.. ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయే అవకాశముందన్నారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ఆయిల్ ధరలు ఆకాశాన్నితాకుతాయని స్వయంగా చెప్పటం సంచలనంగా మారింది. సౌదీ ప్రభుత్వానికి చెందిన రెండు అతిపెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ పై సెప్టెంబర్ 14న జరిగిన డ్రోన్ దాడికి ఇరాన్ కారణమని బిన్ సల్మాన్ ఆరోపించారు.

ఈ దాడి కారణంగానే ఆయిల్ ఉత్పత్తి సగానికి తగ్గిందని, చమురు ధరలు పెరిగాయని అన్నారు. ఇరాన్ ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు.. బలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రపంచ ప్రయోజనాలను బెదిరించే మరిన్ని తీవ్రతలను చూస్తామని సౌదీ రాజు సల్మాన్ పేర్కోనడం అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ మేరకు ఆయన క్రితం రోజున సిబిఎస్ టీవీ ప్రోగ్రాం... 60 మినిట్స్ లో తన ఇంటర్వ్యూను ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఇరాన్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే చమురు సరఫరా అంతరాయం కలగడం తప్పదని ఆయన సూచనలు చేశారు. చమురు ధరలు మన జీవితకాలంలో చూడని విధంగా ఆకాశాన్ని తాకుతాయని హెచ్చరించారు సౌదీ రాజు. అయితే ఇరాన్ తో తాను సైనిక చర్య కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసిన ఆయన... ఇరాన్ తో రాజకీయ పరిష్కారాన్ని ఇష్టపడతానని సల్మాన్ వెల్లడించటం విశేషం. సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.

అయితే సౌదీ రాజు సల్మాన్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము సౌదీ  చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయలేదని అంటోంది. సౌదీ - ఇరాన్ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా.. పెట్రోల్ రేట్లు ఊహించని విధంగా పెరుగుతాయని చెప్పటం ప్రపంచదేశాలను భయపెడుతోంది. పెట్రోల్ రేట్లు ఇదే విధంగా పెరిగితే ఆ రాజు చెప్పినట్లు లీటర్ పెట్రోల్ 150 రూపాయలు అవుతుందా ఏంటీ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SAUDI Arabia  crown king  bin salman  Warning  unimaginably high  Fuel prices  IRAN  UAE  World  political solution  

Other Articles