Honey trap: Cameras in Lipstick, Goggles Filmed Victims ప్రముఖులను బంధించిన లేటెస్ట్ టెక్నాలజీ..!

Mp honey trap case cameras in lipstick goggles used to film victims

MP honey trap case, goggles, lipstick, secret cameras, SIT, MP honey trap case name of journalists, journalists in MP honey trap case, ministers in MP honey trap case, MP MP honey trap case, Madhya Pradesh honey trap case, honey trap, sex scandal, netas, babus, government higher officials, Journalists, Madhya pradesh, crime

The honey-trap and blackmailing racket busted mid-September in Indore and Bhopal saw the ingenious use of spy cameras in lipsticks and goggles, along with the mundane mobile phone, as the accused went about filming their victims.

హనీట్రాప్ కేసు: ప్రముఖులను బంధించిన లేటెస్ట్ టెక్నాలజీ..!

Posted: 09/30/2019 02:59 PM IST
Mp honey trap case cameras in lipstick goggles used to film victims

మధ్యప్రదేశ్లో ప్రభుత్వ బ్యూరోక్యాట్ల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, అధికారులను హనీట్రాప్ పేరుతో జరిగిన భారీ సెక్స్ స్కాండల్ కేసులో తవ్వేకొద్ది సత్యాలు బయటకొస్తున్నాయి. అందమైన అమ్మాయిలు, టీవీ నటిమణుల పేరుతో ప్రముఖులకు ఎర వేసి ముగ్గులోకి దించిన సెక్స్ స్కాండల్ లో బాధితులు అనేక మందే వున్నారని సమాచారం. అయితే ఈ కేసు విషయంలో రోజుకో కొత్తపేరు తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకు సుమారు 80 మంది బీజేపి నేతల పేర్లతో పాటు కాంగ్రెస్ నేతలు, పాత్రికేయుల పాత్రకూడా వుందన్న విషయం వెలుగుచూసింది.

సంచలనం సృష్టించిన ఈ కేసులో విస్మయానికి గురిచేసే అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 40 మంది కాల్ గర్ల్స్‌తో రాజకీయ నాయకులు, అధికారులకు వలపు వల వేసిన ముఠాను కూడా ఎంతో అభివృద్ది చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని వారితో ఏకాంతంగా గడిపిన దృష్యాలను కెమెరాల్లో బంధించారు. రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధికారులను వారు అత్యంత హైక్వాలిటీ కెమెరాలతో బ్లాక్ మెయిలింగ్ చేశారు. ఇందులో ఏమంత విచిత్రముందీ అంటే ఆ హైక్వాలిటీ కెమెరాలు ఎక్కడున్నాయన్న విషయమే విస్మయం కలిగించింది.

లిప్ స్టిక్ ల్లో, కళ్లద్దాల్లో సీక్రెట్ కెమెరాలతో ప్రముఖుల రాసలీలలను చిత్రీకరించారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి పలు స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రముఖ నేతలతో పాటు  మాజీ సీఎం కూడా ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఈ ట్రాప్ లో చిక్కిన ఆయన ఓ యువతితో హోటల్‌ రూమ్ లో గడిపిన దృశ్యాలను లిప్ స్టిక్, గాగుల్స్ వంటి వాటిలో అమర్చి రికార్డ్ చేసి..అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేస్తు కోట్లాది రూపాయలకు ముంచేస్తున్న వైనం బైటపడింది.

ఓ హిందూత్వ సంస్థకు చెందిన నాయకుడికి సన్నిహితుడైన ఓ పెద్దాయనకు సంబంధించిన మరో వీడియో కూడా బయటపడింది. ఈ హనీ ట్రాప్ కు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాకపోతే..ఇవి నిజమైనవా? కావాలని క్రియేట్ చేసినవా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రముఖులతో యువతులు గడుపుతున్న సమయంలో లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో సీక్రెట్ కెమెరాలతో షూట్ చేసి ఈ వీడియోను చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి..వారితో పనులు చేయించుకునేవారు.

ఈ హనీ ట్రాప్ లో ఇరుక్కున్న ఓ సీనియర్‌ ఇంజినీర్‌ ఈ వేధింపులు భరించలేదక పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్‌ జైన్, శ్వేత స్వప్నిల్‌ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్‌ కోరిలను సిట్‌ ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, మాజీ మంత్రులకు సంబంధించిన  వీడియో, ఆడియో క్లిప్‌లను సిట్‌ స్వాధీనం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey trap  sex scandal  netas  babus  Journalists  goggles  lipstick  secret cameras  SIT  Madhya pradesh  crime  

Other Articles