KCR govt dussera gift to BPL families పేదలకు కేసీఆర్ ప్రభుత్వం దసరా కానుక..

Telangana government dussera gift to bpl families of state

CM KCR, Telangana, TRS, CM K Chandrashekar Rao, diagnostic hub, 58 lab test for free, below poverty line, BPL families, Telangana, Politics

Telangana Government and CM KCR had given a gift to below poverty line families of the state.. The CM had made all district of Telangana a diagnostic hub and also ordered officials to make 58 lab tests for the neccessary free.

పేదలకు కేసీఆర్ ప్రభుత్వం దసరా కానుక.. ఉచిత వైద్య పరీక్షలు

Posted: 09/30/2019 01:55 PM IST
Telangana government dussera gift to bpl families of state

ప్రజలు అరోగ్యంగా వుంటేనే రాష్ట్రం అరోగ్యంగా వుంటుందన్న సత్యాన్ని రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. తొలి పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం రెండో పర్యాయంలో మాత్రం ఏకంగా ప్రజలు అరోగ్యంపై దృష్టిని కేంద్రీకరించింది, చిన్నపాటి అనారోగ్యంతోనో లేక జ్వరంతో హాస్పిటల్ కు వెళ్లినా కేవలం ల్యాబ్ పరీక్షలకే వేలల్లో డబ్బు ఖర్చువుతున్న క్రమంలో వారికి ఊరట కల్పిస్తూ దసరా పండగ వేళ తియ్యని కబురును కానుకగా అందించింది.

అసుపత్రులకు వెళ్లితే చాలు పరీక్షలకు డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతుయని గ్రహించి.. పేదలపై ఈ భారం పడకుండా ఊరటను కల్పించింది. పేదలకు మొత్తం 58 రకాల పరీక్షల్ని పూర్తి ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బ్లడ్ టెస్ట్, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ టెస్ట్ లతో పాటు లివర్, కిడ్నీలు, థైరాయిడ్‌, బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ వంటి మొత్తం 58 రకాల పరీక్షలు పూర్తి ఉచితంగా చేసేందుకు చర్యలు తీసుకుంది.

ప్రతీ జిల్లా ఒక డయాగ్నస్టిక్ హబ్

ఉచితంగా వైద్య సేవలు ఎక్కడ చేస్తారు.? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయా.? ఈ సదుపాయం అన్ని జిల్లాల్లోని ప్రభుత్వం హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిందీ ప్రభుత్వం. రాష్ట్రంలోని జిల్లాకేంద్రాల్లో వున్న ప్రభుత్వాసుపత్రులలో ల్యబ్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. రోగనిర్ధారణ పరీక్షలకు గతంలో ప్రత్యేకంగా బడ్జెట్‌ అంటూ ఉండేది కాదు. కానీ సీఎం కేసీఆర్ పాలన ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడంతో రోగ నిర్థారణ పరీక్షలు ప్రజలకు ఉచితంగా జరుగనున్నాయి.

ఇక దీంతో పాటు ప్రతీ జిల్లాల్లోను డయాగ్నస్టిక్‌ హబ్‌ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లోను డయగ్నస్టిక్‌ కేంద్రాల ఏర్పాటు..వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. దాంతో డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వహణకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి.. ప్రజలకు ఈ సేవలు అందేలా చర్యలు తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles