Yogi Adityanath has no understanding of economics యోగీని అడేసుకుంటున్న నెట్ జనులు.. ఎందుకంటే..?

Yogi adityanath has claims recession is because of mughals british

Yogi Adityanath, Chief Minister, Econigmis, Recession, British, mughals, Asaduddin Owaisi, Uttar Pradesh, Politics

Uttar Pradesh CM blamed the Mughals and the Britishers for the weakening Indian economy. Adityanath said that India used to be the biggest economy before the Mughals attacked India and stressed that it further weakened during Britishers' 200-year rule.

యోగీని అడేసుకుంటున్న నెట్ జనులు.. ఎందుకంటే..?

Posted: 09/28/2019 06:36 PM IST
Yogi adityanath has claims recession is because of mughals british

భారతదేశ అర్థిక వ్యవస్థ మందగమనం. ప్రస్తుతం తిరోగమనంలో సాగడానికి కారణం ఎవరు.? అయితే ఎన్డీఏ ప్రభుత్వం లేదా.? గత యూపీఏ ప్రభుత్వం కారణమని ఎవరైనా చెబుతారు. అంతేకాని పీసీ నరసింహారావు, రాజీవ్ గాంధీ, వీపి సింగ్, ఇందిరాగాంధీ, నెహ్రూ పేర్లను ఎవరూ ప్రస్తావించరు. ఎందుకంటే ప్రస్తుత అర్థిక మందగమనానికి మాజీ ప్రధానులకు లింక్ ఏంటీ అన్న ప్రశ్న పండితులకే కాదు పామరులకు కూడా ఉదయిస్తుంది.

కానీ మన ముఖ్యమంత్రి మాత్రం మాజీ ప్రధానులకే కాదు ఏకంగా మన దేశాన్ని పాలించిన పూర్వజులకు కూడా మందగమనంలో భాగముందన్న వాఖ్యలు చేయడంతో ఇదేం వింత వాదన.. ఇదేం విపరీత వాదమని నెట్ జనులు ట్రాల్ చేస్తున్నారు. ఇంతకీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలపాలన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా.? ఆయనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయనేమన్నారంటే.. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనం కావడానికి మొగల్స్, బ్రిటిషర్లు కారణమని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు ఆయనను ఉతికారేస్తున్నారు.

మొగల్స్, బ్రిటిషర్లు రాకముందు ప్రపంచంలో భారత్ బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేదని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బ్రిటిషర్లు దేశాన్ని విడిచివెళ్లేటప్పుడు అలనాటి అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ నీడ మాత్రమే మిగిలిందని తెలిపారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందు ఎకానమీ ఫోరమ్ సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. భారత్‌పై మొగల్స్ దండయాత్రకు ముందు ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

మొగల్స్ వచ్చే కాలానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడింటి ఒక వంతుకు పైగా వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. గల్స్ యుగంలో ప్రపంచ ఎకానమీలో భారత్ అతిపెద్ద వాటాదారుగా ఉందని, 36 శాతానికిపైగా వాటాను కలిగి ఉందని ఆయన వివరించారు. మొగల్స్ వెళ్లిపోయి, బ్రిటిషర్లు వచ్చిన కాలానికి ఈ వాటా 20 శాతానికి పడిపోయిందని తెలిపారు. బ్రిటిషర్ల 200 ఏళ్ల పాలనలో ఇండియన్ ఎకానమీ బలహీనపడిందని పేర్కొన్నారు. బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయేటప్పుడు ఈ వాటా 4 శాతానికి పడిపోయిందని తెలిపారు.

ఇకపోతే యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ నడుస్తున్నాయి. ‘పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లింది.. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మోదీ, అమిత్ షాలు ఆర్థిక వ్యవస్థ బలహీనపడటానికి నెహ్రూ కారణమంటుంటే.. ఈయనగారేమో మొగల్స్, బ్రిటిషర్లు కారణమంటూ ఒక అడుగు ముందుకేశారని వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వైఫల్యాలను వేరొకరి మీదకు నెట్టడం బీబేపీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ట్రోల్స్ నడిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Adityanath  Chief Minister  Econigmis  Recession  British  mughals  Asaduddin Owaisi  Uttar Pradesh  Politics  

Other Articles