Festival of lights and loans ఎస్బీఐ ఆఫర్: తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు

Sbi announces new home loan scheme with low interest rate

sbi home loan,repo rate,sbi,sbi repo rate linked home loan,sbi repo rate,repo linked sbi home loan,repo rate linked home loan sbi,repo rate-linked home loans,repo rate linked home loan,sbi home loan repo rate,home loan,sbi home loans,home loan sbi,sbi home loan, interest rate, customers, business

The State Bank of India is the first bank to have come out with a repo-linked home loan scheme after the RBI made it mandatory for all banks to offer external benchmark-linked floating loan products from October 1.

ఎస్బీఐ ఆఫర్: తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు

Posted: 09/28/2019 07:52 PM IST
Sbi announces new home loan scheme with low interest rate

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్ అందించింది. తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో కస్టమర్లు స్టేట్ బ్యాంక్‌కు వెళ్లి తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు పొందొచ్చు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నవారు..  ఎస్‌బీఐ హోమ్ లోన్ తో దానిని పూర్తి చేసుకోవచ్చు.

అదేంటి భారతీయ స్టేట్ బ్యాంకునే ఎందుకని అంటారా.? ఎందుకంటే ఈ బ్యాంకు మాత్రమే అన్ని బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలను మంజూరు చేస్తోంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు విధానంలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దీంతో ఇప్పుడు మీరు సొంతిల్లు కల సాకరం చేసుకునే అవకాశం లభించినట్టే. ఈ అతితక్కువ వడ్డీ అక్టోబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటటులోకి వస్తాయి’’ అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది.

విజయదశమి రోజును ఏది ప్రారంభించినా.. ఈ నవరాత్రులన్ని రోజులు ఏం చేపట్టినా విజాయాన్ని అందిస్తోందన్న సెంటిమెంట్ దేశ ప్రజల్లో వుంది. దీంతో అదే సెంటిమెంట్ మేరకు దసరా, దీపావళి రోజున పండుగ సీజన్‌లో హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. ఇకపోతే ఎస్‌బీఐ రెపో రేటు అధారిత హోమ్ లోన్స్‌ను మళ్లీ ఆఫర్ చేస్తామని ఇదివరకే పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి రుణాలు అందుబాటులోకి వస్తాయి. కాగా బ్యాంక్ ఈ ఏడాది జూలై 1న ఈ రుణాలు ఆవిష్కరించింది.

అయితే తర్వాత ఈ రుణాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ వీటిని కొన్ని మార్పులతో కస్టమర్లకు అందించేందుకు సిద్ధమైంది. కాగా మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలు పొందేందుకు అర్హతలను మాత్రం వెల్లడించలేదు. రుణం తీసుకోవాలని భావించే వారు ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎస్‌బీఐ పలు అంశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state bank of India  home loans  repo rate loans  interest rate  customers  business  

Other Articles