BHP Shiv Sena Seat sharing finalised మహారాష్ట్రలో బీజేపి-శివసేన మధ్య సీట్ల పంపకం ఫైనల్

Bjp to contest on 144 out of 288 seats shiv sena in 126

Aaditya Thackeray, BJP President Amit Shah, BJP-Shiv Sena, BJP-shiv Sena alliance, Chief Minister Devendra Fadnavis, Devendra Fadnavis, India, JP Nadda, Maharashtra, Maharashtra Assembly election, Maharashtra Assembly elections 2019, Maharashtra Assembly polls, Maharashtra BJP chief Chandrakant Patil, Maharashtra Chief Minister, Maharashtra Election, Maharashtra polls, Shiv Sena, Uddhav Thackeray

Ending all speculations over seat sharing, the BJP is going to contest with the majority share with 144 out of 288 seats and the Shiv Sena with 124 seats and 18 seats have been allotted to the smaller allies, said BJP sources

మహారాష్ట్రలో బీజేపి-శివసేన మధ్య సీట్ల పంపకం ఫైనల్

Posted: 09/27/2019 03:12 PM IST
Bjp to contest on 144 out of 288 seats shiv sena in 126

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా... 24న ఫలితాలు రానున్నాయి. టైమ్ తక్కువగా ఉండటంతో... అధికార బీజేపీ, శివసేన వేగంగా పావులు కదుపుతున్నాయి. 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఈసారి బీజేపీ 144 సీట్లలో పోటీ చేయనుంది... శివసేన 126 స్థానాల్లో బరిలో దిగనుంది. మిగతా 18 స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీచేయనున్నాయని తెలిసింది.

కాగా ఈ సారి మళ్లీ రాష్ట్రంలో బీజేపీ కూటమికి అధికారం లభిస్తే.. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతోందని తెలుస్తోంది. రెండు పార్టీలూ ఈసారి కలిసి పోటీచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించడంతో... సీట్ల సర్దుబాటుకి పార్టీలు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఆదివారం వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కేవలం 25 రోజుల వ్యవధి మాత్రమే వుంది.

ఇప్పటికే తొలిసారి ఎలాంటి కూటమి లేకుండా పోటీ చేసిన బీజేపి అత్యధిక స్థానాలను సాధించింది. అయితే ఈ సారి అలాంటి ప్రయత్నాలకు సిద్దపడకుండా గత అనుభవాలను గుర్తుపెట్టుకుని పోత్తే ముఖ్యమని, కూటమి అధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇక బీజేపి రెండో పర్యాయం శివసేన సహా చిన్న పార్టీల కూటమితో కలసి పోటీ చేసి మరోమారు అధికారాన్ని అందుకోవాలని  ప్రణాళికలు రచిస్తోంది. అందుకు అవసరమైతే మిత్రపక్షాలకు కొన్ని పదవులను కూడా ఇచ్చేందుకు రెడీ అంటోంది.

అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... గురువారం అంతర్గత సమావేశంలో దీనిపై చర్చించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. అభ్యర్థుల పేర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు, ఎవర్ని తప్పించాలి... వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

నిజానికి శివసేన... మహారాష్ట్రలోని 288 స్థానాల్లోని సగం వాటాగా 144 అసెంబ్లీ స్థానాలను అడిగింది. కాగా, కేంద్రంలోని బీజేపి బీజేపీ పెద్దలు పావులు కదిపి శివసేనను తమ దారికి తెచ్చుకున్నారు. జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు... మళ్లీ తమ కూటమినే గెలిపిస్తాయని శివసేన బలంగా నమ్ముతోంది. సీట్ల సర్దుబాటు పూర్తవడంతో... ఇక ఆ పార్టీ ఇప్పుడు... అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 8తో ముగుస్తుంది.

ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ ఆల్రెడీ అనధికారికంగా సీట్ల షేరింగ్ చేసుకున్నాయి. కాంగ్రెస్ 123, ఎన్సీపీ 125 సీట్లలో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఇటీవలే ప్రకటించారు. మిగతా 41 స్థానాల్లో ఇతర మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. రెండు పార్టీల మధ్యా కుదిరిన ఏకాభిప్రాయంతోనే సీట్ల సర్దుబాటు జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 104 మందితో తొలి జాబితా రెడీ చేసుకుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్‌తో పాటూ... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్ పేర్లు కూడా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  shiv sena  uddhav thackeray  devendra fadnavis  NCP  Congress  maharashtra  politics  

Other Articles