Sodomised with coconut shells, man fights for life నవీముంబై షాకింగ్ ఘటన: మగవాడిపై గ్యాంగ్ రేప్.. చిత్రహింసలు

Mumbai man stops for cigarette gangraped by five men in vashi

man gangraped, mumbai man gangraped, navi mumbai man gangrape, vashi man gangrape, mumbai news, man raped in vashi, man raped by drug addict, man raped in vashi, five men rapes man, navi mumbai rape news, mumbai crime news

In a shocking incident, a 36-year-old man was allegedly kidnapped and gang-raped by five drug addicts at Sagar Vihar lake in Navi Mumbai's Vashi. The victim stopped for a cigarette near-deserted spot while going home when the accused took him behind some trees and allegedly raped him.

నవీముంబై షాకింగ్ ఘటన: మగవాడిపై గ్యాంగ్ రేప్.. చిత్రహింసలు

Posted: 09/27/2019 12:49 PM IST
Mumbai man stops for cigarette gangraped by five men in vashi

మహారాష్ట్రలో మానవమృగాళ్లు అడ్డుఅదుపు లేకుండాపొతోంది. దేశ అర్థిక రాజధాని నెలకొన్న రాష్ట్రంలో మహిళలకే కాదు కనీసం పురుషులు కూడా రాత్రివేళల్లో బయట తిరిగేందుకు జంకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ షాకింగ్ ఘటనే అందుకు నిదర్శనం. మగవాడని కూడా వదలకుండా చెట్ల చాటుకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు అతని మర్మాంగనంలో కొబ్బరిచిప్పలు పెట్టి మరీ హింసించి పారిపోయారు ఫైశాచిక మృగాలు.

విధులు ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని సిగరెట్ కావాలని అడిగి, అతడ్ని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుర్మార్గులు. అంతేకాదు.. అతడ్ని శారీరకంగా హింసించి, వెనుక నుంచి ఎండిన కొబ్బరి చిప్పను శరీరం లోపలికి దూర్చారు. నవీ ముంబైలోని వసీలో రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి(36) ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాగర్ విహార్ లేక్ వద్ద అతడ్ని ఆపి సిగరెట్ అడిగారు కొందరు డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు. ఇంతలో.. అతడ్ని కిడ్నాప్ చేసి చెట్ల చాటుకు తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు.

అనంతరం అతడి పురుషాంగంపై దాడి చేశారు. ఈ ఘటన గురించి పోలీసులకు పిర్యాదు చేస్తే పరిణామాలు ఇలా వుంటాయంటూ హెచ్చరిస్తూ బాధితుడి వెనుక భాగం నుంచి లోపలికి ఓ కొబ్బరి చిప్పను దూర్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడ్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేన్నారు. వైద్యులు అతడికి సర్జరీ చేసి కొబ్బరి చిప్పను తొలగించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగానే వుందని పోలీసులు తెలిపారు.  

బాధితుడికి పలు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసముందని వైద్యులు తెలిపారు. అయితే ఒకదాని తరువాత ఒకటి చేసి బాధితుడ్ని కోలుకునేలా చేసేందుకు తాము శ్రమిస్తున్నామన్నారు, కాగా, ఈ ఘటన నేపథ్యంలో తమ కాలనీకి వచ్చే రోడ్డుకు ఇరువైపులా చెట్లు వున్నందున భద్రతను పెంచాలని కూడా కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన 25-30 ఏళ్ల యువకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man gangrape  navi mumbai  vashi  drug addict  mumbai shocker  mumbai crime news  

Other Articles