Mla alla ramakrishna reddy challges lingamaneni లింగమనేని లేఖపై సవాల్ విసిరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

Mla alla ramakrishna reddy challges lingamaneni on house permission

Chandrababu's house in Undavalli, Undavalli chandrababu house, Alla Ramakrishna Reddy, chandrababu house demolition, Lingamaneni, Industrailist lingamaneni house, CM YS Jagan, TDP, YSRCP, Congress, andhra pradesh, Politics

Reacting to the letter written by Lingamaneni Ramesh to Jagan Mohan Reddy, Mangalagiri MLA Alla Ramakrishna Reddy has challenged Ramesh and N Chandrababu for an open debate on permission to Lingamaneni Estate.

లింగమనేని ఇంటికి ఒక్క అనుమతి లేదు: ఆళ్ల రామకృష్ణారెడ్డి

Posted: 09/25/2019 11:59 AM IST
Mla alla ramakrishna reddy challges lingamaneni on house permission

విజయవాడ సమీపంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలకు మధ్య పెను దుమారం రేగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు నివాముంటున్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఇంటి కూల్చివేతతో ఇరు పార్టీల నడుమ రాజకీయ రగడకు వేదికైంది. ప్రతిపక్షం సవాళ్లకు అధికార పక్షం నేతలు ప్రతిసవాళ్లు విసరుతున్నారు. తాజాగా సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కూడా ఈ వ్యవహర విషయమై లింగమనేని రమేష్ కు సవాల్ విసిరారు.


సీఆర్డీఏ నోటీసులు అందుకున్న పారిశ్రామిక వేత్త లింగమనేని ఏపీ సీఎం జగన్‌కు పారిశ్రామికవేత్త రమేష్ లేఖ రాయడంపై విరుచుకుపడిన ఆయన అన్ని అనుమతులు వున్నాయన్న విషయమై తనతో లింగమనేని బహిరంగ చర్చకు సిద్దమా.? అని ప్రశ్నించారు. ఆయన గెస్ట్ హౌజ్‌కు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కూల్చేస్తున్నారు.. గుండె కోత ఉందంటున్న లింగమనేని.. వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు.. లింగమనేని కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి.. తిరిగి కౌంటర్ దాఖలు చేసే ప్రయత్నం చేయని లింగమనేని.. ప్రజల కోసం పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ఎక్కడైతే ఆగిందో.. అక్కడనే లింగమనేని ఆస్తులు వున్నాయన్నారు. బాబు, లోకేష్‌లకు ఇంటి అద్దె ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇలా వారు రూ. కోటి 20 లక్షలు ఇంటి అద్దె అలవెన్సు కింద ప్రజాధనం డ్రా చేసుకున్నారని తెలిపారు. వీరిద్దరూ డబ్బులు ఇచ్చారా ? లేదా తెలియచేయాలని లింగమనేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

డబ్బులు ఇస్తే.. ఐటీ రిటర్న్‌లో అద్దెను చూపించారా ? లేక ఉచితంగా ఇస్తే..రూ. కోటి 20 లక్షలు బాబు..లోకేష్‌లు ఎలా డ్రా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గంలో 20 ఎకరాలు అప్పన్నంగా లింగమనేని కాజేశారని ఆరోపించారు. రెయిన్ త్రీ పార్కుకు ఎలా దారి వచ్చిందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలు బయటపెడుతానన్నారు. ఈ పార్కుకు మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.., ఇందుకు వేసిన పైపులైన్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. కక్ష కట్టాల్సిన అవసరం సీఎం జగన్‌కు అవసరం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Lingamaneni  Alla Ramakrishna Reddy  CM YS Jagan  TDP  YSRCP  andhra pradesh  Politics  

Other Articles