Rain Expected In More Than 15 States ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Rain expected in more than 15 states including telugu states says met office

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, upper air cyclonic circulation, moderate rainfall in Telangana, Krishna, Godavari, Karnataka, Maharashtra, Uttar pradesh, Madya Pradesh, depression, Rains in Telangana, Rain Forecast

IMD predicts heavy to very heavy rainfall very likely at isolated places over Assam, Meghalaya, Madhya Maharashtra, Marathwada, Konkan, Goa, Andhra Pradesh and Yanam, Telangana and interior Karnataka.

ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Posted: 09/25/2019 10:53 AM IST
Rain expected in more than 15 states including telugu states says met office

తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు ఇవాళ కూడా కురువనున్నాయని భారత వాతావరణ శాఖ సూచిందింది. ఆంద్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మరఠ్వాడ ప్రాంతాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

ఈ రాష్రాటతో పాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, అసోం, ఒడిశా, మేఘాలయ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జార్ఖండ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలో కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా నదులతో పాటు పరివాహిక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో అటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే పలుమార్లు గేట్లు ఎత్తి ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని దిగువకు వదిలిన అధికారులు.. మళ్లీ డ్యాముల్లోకి తరలివస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా అంచానా వేస్తున్నారు.

డ్యామ్ లలో ఇప్పటికే జలకళ నెలకొని నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో నీటిని దిగువకు వదలడం కోసం అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు డ్యాములు బ్యాక్ వాటర్ ప్రాంతాలతో పాటు లొతట్టు ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక తమిళనాడు, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని... మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles