Maharashtra, Haryana Assembly Polls on October 21 మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి మ్రెగిన నగరా..!

Maharashtra haryana assembly elections on october 21 counting and results on october 24

bharatiya janata party, Congress, Maharashtra, Nationalist Congress Party, Haryana Legislative Assembly, Devendra Fadnavis, Election Commission, Lok Sabha, Manohar Lal, Shiv Sena, Bhupinder Singh Hooda, Indian National Lok Dal

Chief Election Commissioner Sunil Arora on Saturday in a press conference scheduled at 12 noon, announced the dates for the upcoming assembly elections in Haryana and Maharashtra. Date of poll for both the states is October 21.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి మ్రెగిన నగరా..! 21 పోలింగ్.. 24న కౌంటింగ్..

Posted: 09/21/2019 02:39 PM IST
Maharashtra haryana assembly elections on october 21 counting and results on october 24

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ప్రచారపర్వాలకు సన్నధమవుతున్న తరుణంలో ఒకే విడతలో అక్టోబరు 21న ఆయా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్ల ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటితోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 64 శాసనసభ నియోజకవర్గాలకు ఉప-ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అదే నెల 24న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్టు ఎన్నికల షెడ్యూలును విడుదల చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా షెడ్యూలు విడుదల కావడంతో ఆయా రాష్ట్రాలతో పాటు ఉపఎన్నికలు నిర్వహించనున్న నియోజకవర్గాలలోనూ నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సెప్టెంబరు 27 వెలువడనుంది. ప్రకటిత షెడ్యూల్డు మేరకు అక్టోబరు 4 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబరు 5 నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడవు 7 తేదీగా నిర్ణయించారు. తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక సైతం అక్టోబరు 21 నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హరియాణాలో 1.82 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ తెలిపారు.

అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించరాదని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది. ఎన్నికల కోసం భద్రతా బలగాలను మోహరించనున్నారు. మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన గడ్చిరోలి, గొండియాలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తామని సునీల్ అరోరా పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీప్యాట్‌లను లెక్కించనున్నట్టు స్పష్టం చేశారు.

హుజుర్ నగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

తెలంగాణ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, గుజరాత్, అసోమ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో హుజూర్ నగర్ కు కూడా ఉపఎన్నిక జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 28 చివరి తేదీ. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Fadnavis  sharad pawar  BJP  NCP  Congress  Assembly polls  Maharashtra  Haryana  Politics  

Other Articles