Former TDP MP Naramalli Sivaprasad no more చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

Former mp and senior tdp leader siva prasad passes away at 68

Naramalli Sivaprasad, TDP politician, Andhra Pradesh, Naramalli Sivaprasad dies, N Shiv prasad no more, Chennai Apollo, Former TDP MP Siva prasad no more, Former TDP MP died, chittoor ex MP no more, Siva prasad passed away, Suffers Kidney Ailment, Chittoor, chandrababu naidu, TDP, nara lokesh, Andhra Pradesh, Politics

Former Chittoor MP and TDP leader Naramalli Shiva Prasad passed away here at Chennai today around 2 pm. He is learned to have been suffering from kidney ailment for some time now and breathed his last at Apollo hospitals in Chennai.

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత..

Posted: 09/21/2019 03:46 PM IST
Former mp and senior tdp leader siva prasad passes away at 68

సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ కు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో అసుపత్రి వర్గాలు అధికారికంగా దృవీకరించాయి. ఇటు శివప్రసాద్ కుటుంబసభ్యులు కూడా ఆయన మరణవార్తతో శోకసంధ్రంలో మునిగిపోయారు.

నాలుగు రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేటు అసుపత్రి నుంచి ఆయనను హుటాహుటిన చెన్నైలోని అపోలో అసుపత్రికి తరలించిరు. ఆయనకు ఇక్కవ వైద్యులు చికిత్సనందిస్తున్న క్రమంలో నిన్న ఒక్కసారిగా ఆయన మరణించారన్న వార్తలు వచ్చాయి. అయితే అసుపత్రి వర్గాలతో పాటు శివప్రసాద్ కుటుంబసభ్యులు ఈ వార్తలను ఖండించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని.. ఆయనకు వెంటిలేటర్ పై శ్వాసను అందిస్తున్నామని అసుపత్రి వర్గాలు తెలిపాయి.

కాగా, శివప్రసాద్ మరణవార్తతో టీడీపీ అధినేత కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. శివప్రసాద్ మరణంపై స్పందించిన ఆయన.. తన చిరకాల మిత్రుడు చనిపోవడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం శివప్రసాద్ ఎంపీలందరితో కలసి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే పరిమితం కాకుండా యావత్ రాష్ట్రానికే తీరని లోటన్నారు. శివప్రసాద్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుబూతిని తెలిపారు.

అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఎంపీ శివప్రసాద్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటు లోపలా బయటా పోరాటం చేశారని, ఈ సందర్భంగా ఆయన జాతీయ నేతలతో పాటు జాతీయ మీడియా దృష్టిని కూడా అకర్షించని నేతగా మారారని ప్రశంసించారు. శివప్రసాద్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. ఆయన కుటుంబసభ్యలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన వేషాలతో వెరైటీగా నిరసన తెలిపి తమ సమస్యలను పాలక ప్రభుత్వాలకు తెలిపడంతో పాటు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షంచాడు. హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంట్ ముందు వెరైటీ వేషధారణల్లో ఆందోళనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. శివప్రసాద్ కు చిన్నప్పటి నుంచి నాటకాలు చూడటం కన్న వాటిలో నటించాలంటేనే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన చిన్ననాటి నుంచి నాటకాలు వేస్తూ స్వతహాగా రంగస్థల నటుడిగా రాణించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో తనదైన విక్షలణ నటనను ప్రదర్శించారు. పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles