boat tragedy: harshakumar sensational allegations మంత్రి ఒత్తడితోనే అనుమతి.. బోటులో 93 మంది

Harsha kumar sensational allegations in devipatnam boat tragedy

Avanti Srinivas, Harsha Kumar, harsha kumar allegations on avanti srinivas, avanti srinivas pressure, boat capsizes in Godavari river, sight seeing boat capsizes, CM Jagan, Twitter, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

Former MP Harsha Kumar stands on his sensational allegations against Minister Avanti Srinivas and questions why dont the government bringout the photos taken by the police, if there were not 93 members on board.

ఆ ఫోటోలను ఎందుకు బయటపెట్టడం లేదు: హర్షకుమార్

Posted: 09/21/2019 09:18 AM IST
Harsha kumar sensational allegations in devipatnam boat tragedy

దేవిపట్నం మండలపరిధిలోని కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన ఘోర దుర్ఘటనలో గల్లంతైన వారి కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి ఈ జరిగిన ఈ దుర్ఘటనలో ఇంకా పలువురి అచూకీ లభ్యంకాలేదు. దీంతో గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే వుంది. ఈ ప్రమాదఘటన విషయంలో అధికార, విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్దం కొనసాగుతుంది.

ఈ తరుణంలో తెరపైకి వచ్చిన కాంగ్రెస్ నేత మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తడి మేరకే ఈ ప్రమాదం జరిగిందని సంచలన అరోపణలు చేశారు. కాగా, ఈ అరోపణలను అధికార పక్షం ఖండించింది. దీంతో మళ్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డ హర్షకుమార్.. గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని విమర్శించారు. సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన ప్రభుత్వం.. ఇక తమ అన్వేషణకు స్వస్తి పలికారని విమర్శించారు.

అయితే అదే సమయంలో తాను నిలదీయడం వల్లే మళ్లీ కొనసాగిస్తున్నారని అన్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి అచూకీని వారి బంధువులకు అప్పగించడంలోనూ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన దుయ్యబట్టారు, ప్రజలు, బాధితుల తరఫున తాను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని అన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల ప్రమాద ఘటనపై నాడు వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆ ఘటనకు సంబంధించి ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని నాడు విమర్శలు చేశారని, మరి, బోటు ప్రమాద ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేవలం సమీక్ష నిర్వహించి వెళ్లిపోతే సరిపోతుందా? కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెబితే సరిపోతుందా? అని సీఎం జగన్ ని హర్షకుమార్ ప్రశ్నించారు. అధికార పక్షం సభ్యులు తాను చేస్తున్న అరోపణలను ఖండిస్తే సరిపోదని అన్న ఆయన.. నిజంగా ఆ బోటులో 93 మంది లేకపోతే, పోలీసులు తీసిన ఫొటోలు ఎందుకు బయటపెట్టట్లేదు?’ అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles