Man's last rites stopped as he failed to repay loan అప్పు తీర్చలేదని అంత్యక్రియల నిలపివేత..

Man s last rites stopped by moneylenders as he failed to repay loan

chittoor, financiers, shiva kumar, venkata ramana, creamation stopped by financiers, dead body hanged to tree, loan reimbursement, police story, police case, andhra pradesh, crime

Harrasment of Money lenders of chittoor is unbearable, as they stoped the creamation of a man who had failed to repay the loan, they demand his family members to pay the amount and perform the last rites.

ఏపీలో అమానవీయ ఘటన.. అప్పు తీర్చలేదని అంత్యక్రియల నిలపివేత..

Posted: 09/20/2019 11:52 AM IST
Man s last rites stopped by moneylenders as he failed to repay loan

ఆంధ్రప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మనుషుల రక్తాన్ని తాగే జలగల్లా తయారై అక్కడి ఫైనాన్షియర్లు.. తమకు రావాల్సిన వ్యక్తి దహనసంస్కారాలను కూడా అడ్డకుని బాకీని చెల్లించే వరకు అంత్యక్రియలు జరగనివ్వమని భీష్మించిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం నివ్వెరపోయేలా చేసే ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది.
చనిపోయిన ఓ వ్యక్తి... "బాకీ తీర్చలేదు" అంటూ అతని మృతదేహానికి రెండు రోజులుగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటున్నారు అప్పుల వాళ్ళు. మృతుని భార్య పిల్లలు ఎంత ప్రాధేయ పడ్డా కనికరం చూపలేదు. పైగా చనిపోయిన బాధితుణ్ని వెలివేస్తున్నట్టుగా చింతచెట్టుకి చెప్పును వేలాడదీసి దానిపైన మృతుని పేరు రాసి ఆటవిక న్యాయాన్ని అమలు చేశారు. నాగరికత కొత్త పుంతలు తోక్కుతున్న ఈ రోజుల్లో ఇంకా అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే అప్పు తీసుకున్న వ్యక్తికి పూచికత్తుగా వుండటంతో.. ఆ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకుని అమానవీయంగా వ్యవహరించారు ఫైనాషియర్లు. అప్పు తీసుకున్న వ్యక్తి వున్నా అతని వద్దనుంచి డబ్బులు వసూలు చేయడం మాని.. పూచీకత్తు వున్న వ్యక్తి మరిణిస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. పుంగనూరులోని మోండోలు సామాజిక వర్గానికి చెందిన శివకుమార్... అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర అప్పుచేశాడు.

దీనికి అతని భార్య తండ్రి వెంకటరమణ హామీ ఇచ్చాడని అప్పుల వాళ్లు చెబుతున్నారు. అయితే అనారోగ్యంతో వెంకటరమణ రెండురోజుల కిందట చనిపోయాడు. ఐతే అతని అల్లుడు శివకుమార్ తమ దగ్గర తీసుకున్న లక్షల రూపాయల అప్పు తీర్చకుండా శవానికి అంత్యక్రియలు జరిపితే కుదరదన్నారు అప్పులవాళ్ళు. తమ కుల సంప్రదాయం ప్రకారం ఒక చెప్పుకు మృతుని పేరు రాసి దాన్ని చింతచెట్టుకు వేలాడదీశారు. వెంకటరమణను కడసారి చూసేందుకు వెళ్ళే బంధువులను అడ్డుకునేందుకు యత్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chittoor  financiers  shiva kumar  venkata ramana  creamation  andhra pradesh  crime  

Other Articles