boat tragedy: harshakumar alleges avanti's pressure మంత్రి ఒత్తడితోనే అనుమతి.. బోటులో 93 మంది

Harsha kumar alleges minister avanthi pressure behind boat permission

Avanti Srinivas, Harsha Kumar, harsha kumar allegations on avanti srinivas, avanti srinivas pressure, boat capsizes in Godavari river, sight seeing boat capsizes, CM Jagan, Twitter, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

Former MP Harsha Kumar alleges Minister Avanti Srinivas pressure on officials to permit the Tourist boat into River Godavari in Andhra Pradesh, which capsized on 15th September. He also alleged that there were 93 members on board.

అమాత్య అవంతి ఒత్తిడితోనే అనుమతి.. బోటులో 93 మంది

Posted: 09/19/2019 07:31 PM IST
Harsha kumar alleges minister avanthi pressure behind boat permission

గోదావరిలో నదిలో దేవిపట్నం మండలపరిధిలోని కచ్చలూరు వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో గల్లంతైన వారి కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి  ఈ దుర్ఘటన జరుగుగా ఇంకా పలువురి అచూకీ లభ్యకాలేదు. దీంతో గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 39కి చేరింది. ఇవాళ కూడా అధికారులు పలు మృతదేహాలను వెలికితీశారు.

ఈ ఘటనలో మొత్తంగా 39 మంది వరకు గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చినా.. అది నిజం కాదని బోటులో వున్నవారి సంఖ్య 93 అని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ హర్షకుమార్ అరోపించారు. ఈ మేరకు ఆయన బోటు ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి  బోటును నడపడానికి  ఉన్నత వర్గాల ఒత్తిడే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 93 మంది ఉన్నారని ఆయన చెప్పారు.

దేవీపట్నం ఎస్ఐ వద్దని వారించి బోటును వెనక్కు తీసుకెళ్లాలని కోరినా.. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని హర్షకుమార్ ఆరోపించారు. సోమవారం నాడే బోటు జాడ తెలిసిందన్నారు. కానీ, దాన్ని బయటకు తీస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయని బయటకు తీయడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ప్రమాదం జరిగిన బోటులో కూడ ఇలానే జరిగి ఉండొచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా మునిగిన బోటును వెలికి తీసే అవకాశం ఉందన్నారు. అధికారులు ఈ బోటును తీసేందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు. గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదం విషయంలో  అధికారులు సీఎం జగన్ కు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.  

మృతుల కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. ఈ ప్రమాదంపై ప్రత్యేక  అధికారితో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాగా హర్షకుమార్ అరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటరిచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బోటుకు అనుమతి ఇచ్చేందుకు ఒత్తిడి చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తనపై తప్పుడు అరోపణలు చేస్తున్న హర్షకుమార్ పై పరువు నష్టం దావా వేస్తానని మంత్రి అవంతి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles