businesswoman Reeta Lankalingam found hanging ఆర్థికమాంద్యం ఎపెక్టేనా.? మహిళా వ్యాపారవేత్త ఆత్మహత్య..

Telugu content

Reeta Lankalingam, Lanson Group, Reeta Lankalingam found dead, Reeta Lankalingam dead, chennai businesswoman dead Indian economy, demonetisation, GST, economic crisis

Chennai businesswoman Reeta Lankalingam apparently committed suicide, preliminary investigation is on. Reeta was the Joint Managing Director of the Lanson Group, one of Toyota's top dealers in India.

ఆర్థికమాంద్యం ఎపెక్టేనా.? మహిళా వ్యాపారవేత్త ఆత్మహత్య..

Posted: 09/13/2019 06:41 PM IST
Telugu content

తమిళనాడులోని చెన్నైలో మహిళా పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. లాన్సన్ టయోటా కార్ల డీలర్‌షిప్ యజమాని అయిన రీటా లంకలింగ(50) బుధవారం రాత్రి సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని నుంగంబాక్కం కోథారీ రోడ్డులోని భారీ భవంతిలో లంకలింగం, రీటా దంపతులు నివాసముంటున్నారు. లంకలింగం లాన్సన్‌ అనే సంస్థను ఏర్పాటుచేసి తమిళనాడు వ్యాప్తంగా టయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆ సంస్థకు ఆయనే ఛైర్మన్‌గా ఉండగా.. భార్య రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రీటా రోజూ ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుంటారు. అయితే గురువారం 11 గంటలైనా రీటా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో పనిమినిషి తలుపు తట్టింది. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే నుంగంబాక్కం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపు పగులగొట్టి చూడగా రీటా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.

పోలీసులు ఆమె మృతదేహాన్ని దించి కీల్పాక్‌ మెడికల్ కాలేజ్‌కి తరలించారు. రీటా ఆత్మహత్యపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఈ ఎఫెక్ట్ వారి వ్యాపారంపై పడిందని, ఆ మనోవేదనతోనే ఆమె ప్రాణం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా రీటా మనస్తాపంగా ఉంటున్నారని, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదని సన్నిహితులు చెబుతున్నారు.

కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రీటాకు భర్తతో ఏమైనా విభేదాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రీటా ఆత్మహత్యకు ఆర్థిక మాంద్యమే కారణమన్న వాదనలు ఎక్కువగా వినిపించడంతో వ్యాపార వర్గాలు కలవరపడుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎంతగా దిగజారుతుందోనని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles