Give status of social media accountability norms: SC ఆ అకౌంట్ల అనుసందానంపై 24లోగా కౌంటర్ ఇవ్వండి: సుప్రీం

Supreme court probes govt on plan to link social media accounts to aadhaar

facebook, facebook data sharing, facebook privacy, allegations on facebook data sharing, facebook, instagram, whatsapp, Social Media, Aadhar numbers, personal information, data sharing, Supreme court

The Supreme Court of India bench, headed by Justice Deepak Gupta, has reportedly asked the central government whether it is contemplating any move to regulate social media by linking of social media user accounts with their Aadhaar ID.

ఆ అకౌంట్ల అనుసందానంపై 24లోగా కౌంటర్ ఇవ్వండి: సుప్రీం

Posted: 09/14/2019 11:31 AM IST
Supreme court probes govt on plan to link social media accounts to aadhaar

ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, ఓటర్ ఐడీలు, పాన్‌కార్డుల అనుసంధానానికి మాత్రమే పరిమితమైన ఆధార్ సంఖ్యను ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలకు అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడానికి సంబంధించి చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నదీ, లేనిదీ ఈ నెల 24లోగా తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన సమాధానం తర్వాతే ఫేస్‌బుక్ బదిలీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
 
జస్టిస్ దీపక్ మిశ్రా గుప్తా, అనిరుద్ధ బోస్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఫేస్‌బుక్ ఇంక్ వేసిన పిటిషన్‌ను విచారించింది. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు ఆధార్‌ను అనుసంధానించడంపై దాఖలై వివిధ హైకోర్టుల వద్ద పెండింగులో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ ఇంక్ బదిలీ పిటిషన్ దాఖలు చేసింది. గుర్తింపు ప్రామాణికత కోసం సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించాలని కోరుతూ గతేడాది జూలైలో మద్రాస్ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.
 
పేస్‌బుక్ బదిలీ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము నిర్ణయం తీసుకోవాలా? లేక, హైకోర్టులకు వదిలేయాలా.? అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. అయితే, త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్రం తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. వివిధ హైకోర్టులలో పెండింగులో ఉన్న పిటిషన్లను అత్యున్నత ధర్మాసనానికి బదిలీ చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడమంటే యూజర్ల స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని ఫేస్‌బుక్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  Social Media  Aadhar numbers  personal information  data sharing  Supreme court  

Other Articles