Balapur Ganesh Laddu sets Record Price this Year బాలాపూర్ లడ్డూకు భలే ధర.. దక్కించుకున్న కొలన్ ఫ్యామిలీ

Balapur ganesh laddu sets record price this year

ganesh chaturthi 2019, ganesh chaturthi visarjan, ganesh laddu auction, ganesh laddu, balapur ganesh laddu, ganesh chaturthi in Telangana, ganesh immersion in Hyderabad, ganesh idol, ganesh chaturthi ganesh murti, Ganesh bhagwan murti, ganesh chaturthi mela, ganesh puja, how to celebrate Ganesh Chaturthi, ganesha festival, panchmi 2019, 2019 ganesh chauth, ganesh chaturthi mela, 2019 mein ganpati chaturthi kab hai, ganesh festival wishes messages

After the 10-day long festival mythological occasion of Lord Ganesha Today, on Anantha Chaturdhi is immersed in water before that the precious laddu was auctioned. Balapur Laddu had auctioned for a record price.

బాలాపూర్ లడ్డూకు భలే ధర.. దక్కించుకున్న కొలన్ ఫ్యామిలీ

Posted: 09/12/2019 01:05 PM IST
Balapur ganesh laddu sets record price this year

ఆనంత చతుర్ధశి రోజున వినాయక ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడం.. పదకొండు రోజుల పాటు మహాగణపతితో పూజలందుకున్న వినాయకుడి ప్రీతికరమైన ప్రసాదంగా ప్రసిద్ది చెందిన లడ్డూకు భలే గిరాకీ ఏర్పడుతుంది. ఇక హైదరాబాద్ అనగానే బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టమైనదిగా ప్రసిద్ది చెందింది. గణేశ్ భక్తులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డూను కొలన్ రామిరెడ్డి రూ. 17.60 లక్షలకు దక్కించుకున్నారు. 

గత సంవత్సరం లడ్డూ ధర రూ. 16.60 లక్షలకు పోగా, ఈ సంవత్సరం లడ్డూ ధర దాన్ని మించింది. రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు కొలన్ రామిరెడ్డికి అందించారు. కాగా, కొలన్ ఫ్యామిలీ సభ్యులు గతంలో పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇక నగరంలోని భోలక్‌పూర్ డివిజన్‌లో వినాయకుడి బంగారు లడ్డూ ప్రసాదానికి ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఇది తక్కువ ధరే అయినప్పటికీ దక్కించుకునేందుకు మాత్రం భక్తులు పోటీపడ్డారు. 

శ్రీ సిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రసాదంగా సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను కూడా పెడుతూ వస్తున్నారు. ఈసారి రూ.5 లక్షల విలువైన 123 గ్రాముల బంగారంతో లడ్డూను తయారుచేసి ఉంచారు. నిన్న ఈ లడ్డూకు వేలం పాట నిర్వహించగా దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. చివరికి స్థానిక చేపల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ రూ.7.56 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది 120 గ్రాముల బంగారంతో లడ్డూను తయారుచేయగా స్థానికంగా నివసించే కె.భాస్కర్ అనే వ్యక్తి రూ.8.1 లక్షలకు దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles